30.2 C
Hyderabad
April 27, 2025 19: 48 PM
Slider ఆంధ్రప్రదేశ్

సిఎం జగన్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వద్దు

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు సంబంధించి పార్టీ నాయకులు, జనసైనికులు ఏ మాత్రం స్పందించవద్దని జనసేన పార్టీ సూచించింది. భవన నిర్మాణ కార్మికుల కోసం చేస్తున్న పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాలసీల గురించి జనసేన అధ్యక్షుడు మాట్లాడుతుంటే… వ్యక్తిగతంగా జగన్ మాట్లాడుతున్నారన్నారు. ఇది బాధాకరమైనప్పటికీ ప్రజా క్షేమం కోసం భరించాలని పవన్ చెప్పినట్లు జనసేన పార్టీ నేతలు ట్విట్టర్లో తెలిపారు. విజయవాడలో మంగళవారం జనసేనాని మీడియా సమావేశం నిర్వహిస్తారని… అదే రోజు అన్నింటికి బదులిస్తారని… దయచేసి పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

సాగర్ హై వే పై ప్రమాదం: ఆరుగురు మృతి

Satyam NEWS

కాంగ్రెస్ వాష్ అవుట్: యుపి శాసన మండలిలో కొత్త చరిత్ర

Satyam NEWS

ఓటు పట్ల అవగాహన అవసరం

mamatha

Leave a Comment

error: Content is protected !!