40.2 C
Hyderabad
May 2, 2024 16: 20 PM
Slider నిజామాబాద్

కొట్టుకు పోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు వేగవంతం

#MLAHanumanthShinde

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదడిగి వాగులో వరద నీటి ఉద్ధృతికి గొళ్ల హనుమాన్లు(35)గల్లంతైన విషయం తెలుసుకున్న జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే తక్షణ చర్యలు తీసుకున్నారు. గ్రామాన్ని గురువారం సాయంత్రం ఆయన సందర్శించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు.

అనంతరం పోలీస్ రెవెన్యూ అధికారులతో ఆయన మాట్లాడుతూ  గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బిచ్కుంద  ఎంపీపీ అశోక్ పటేల్, పెద్దదడిగి సర్పంచ్ ఆకుల సాయిలు ,సీతారాంపల్లి సర్పంచ్  ర్యాల గంగారెడ్డి, ఖతగామ్ మాజీ సర్పంచ్ హనుమాన్లు,నాయకులు సహదేవ్,ఎస్సై సాయన్న, పోలీస్, రెవెన్యూ అధికార యంత్రాంగం  సిబ్బంది ఉన్నారు.

హనుమాన్లు గల్లంతు అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు అధికారులు తెలిపిన కథనం మేరకు పెద్దదడిగి గ్రామానికి చెందిన గొళ్ల హనుమాన్లు బుధవారం మధ్యాహ్నం  తన ఆవు వాగులోని  నీటిలో చిక్కుకుందని దానిని నీటిలో నుండి తప్పించబోయి తాను వరద నీటి ఉధృతిలో  చిక్కుకుని గల్లంతయ్యారని  వారు తెలిపారు.

ఈ విషయం రెవెన్యూ ,పోలీస్ యంత్రాంగానికి తెలియజేయడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పెద్దదడిగి చిన్న దడిగి గ్రామాల మధ్య ఉన్న వంతెన వద్ద వలలు ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లతో  గురువారం సాయంత్రం వరకు  వెతికినా కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అధికార యంత్రాంగం గ్రామస్తులు అందరూ వాగువద్ద వెతుకులాటలో నిమగ్నమయ్యారు.గల్లంతైన వ్యక్తికి ఒక పాప ఇద్దరు కవలలు  కొడుకులు భార్య తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా కేసు నమోదు చేయలేదని ఎస్సై తెలిపారు.

Related posts

కిల్లింగ్ మిస్టరీ: దివ్య హత్య కేసులో కొత్త మలుపు

Satyam NEWS

10వ తరగతి పూర్తి చేసిన వారికి శుభవార్త

Satyam NEWS

రోడ్ సేఫ్టీ మీటింగ్: ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి…!

Bhavani

Leave a Comment