26.7 C
Hyderabad
May 3, 2024 10: 14 AM
Slider ముఖ్యంశాలు

అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెరాస   పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.

సైదిరెడ్డి మాట్లాడుతూ రైతులను తాను కొట్టించానని ఓ టీవీ ఛానల్లో అసత్యాలు ప్రచారం చేయడం జరిగిందని, అది అవాస్తవమని వారికి సూటిగా చెప్తున్నానని ఆయన అన్నారు.

అదే విధంగా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. హుజూర్ నగర్ అభివృద్ధి పథంలో దూసుకు పోతుంటే  చూసి తట్టుకోలేని కొందరు ఒక టీవీ ఛానల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు.

గతంలో 540 సర్వే నెంబర్లో అవకతవకలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు.

అమాయక గిరిజన రైతులకు అన్యాయం జరగకూడదని తాను పోరాడుతుంటే అది చూసి తట్టుకోలేని కొందరు అక్రమార్కులు అమాయక గిరిజన రైతుల మధ్య  చిచ్చు పెడుతున్నారని అన్నారు.

జర్నలిస్టు విలువలను కాపాడుతూ భాష సరిగా మాట్లాడాలని అన్నారు. అసత్యాలు ప్రచారం చేసే  ఛానల్ ను ప్రజలు ఎప్పుడు విశ్వసించరని, మేళ్ళచెరువు మహా సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ  విషయంలో ముందు కొందరు రాద్ధాంతం చేసి ప్రజాభిప్రాయ సేకరణ రోజు చేతులెత్తేసిన వారు వారి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

పరిశ్రమల వల్ల నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుందని, నిరుపేదలకు ఉపయోగపడే ప్రతి ఇండస్ట్రీ కీ కూడా తమ మద్దతు ఉంటుందని అన్నారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు.

540 సర్వే నెంబర్ భూ సమస్య 15 నుండి 20 సంవత్సరాలుగా ఉందని,నిజమైన రైతులకు న్యాయం జరగాలని సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతుందని అన్నారు. నిజమైన రైతులకు ఎటువంటి అన్యాయం జరగలేదని అన్నారు.

Related posts

ప్రతిభ కనబర్చిన విజయనగరం పోలీసులకు ప్రశంసా పత్రాలు

Satyam NEWS

ఆరెస్సెస్‌తో సమావేశంపై జమాతే ఇస్లామీ ప్రజలకు సమాధానం చెప్పాలి

Satyam NEWS

ఇష్టానుసారంగా ఈ- చలానా విధిస్తున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment