38.2 C
Hyderabad
April 29, 2024 22: 20 PM
Slider వరంగల్

ఇష్టానుసారంగా ఈ- చలానా విధిస్తున్న పోలీసులు

#echallan

తాటికాయంత అక్షరాలతో టూ వీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడుతున్నా కూడా మరొక టూ వీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కి ఈ చలానా విధించిన పోలీసులపై ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఇదెక్కడి అన్యాయం ఇదెక్కడి దుర్మార్గం అంటూ బాధితుడు కూడా వాపోతున్నాడు. ములుగు జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పాయిరాల సంపత్ టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ టూవీలర్ కలిగి ఉన్నాడు.

దాని రిజిస్ట్రేషన్ నెంబర్ TS25E2784. అతను ఆ బండిని నడపక దాదాపుగా 20 రోజులు అవుతుంది. కానీ ఆ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ మీద తేదీ 31వ తేదీ సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు ఈ చలాన్ విధించినట్టు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే దానిలో కనిపిస్తున్న ఈ చలానా ఫోటో లో ఉంది తన బండి కాదు అని, తన బండి రిజిస్ట్రేషన్ నెంబరు కాదు కానీ తన బండి రిజిస్ట్రేషన్ నెంబర్ మీద ఈ చాలానా వచ్చింది అని బాధితుడు వాపోతున్నాడు.

ఈ చలానా విధించిన స్థలం జూకల్ క్రాస్ రోడ్ కొత్తపేట చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని ఉంది. ఈ చలానా విధిస్తున్న అధికారులు ఇటువంటి తప్పిదాలు చేయడంతో అన్యాయంగా పేద ప్రజలు బలవుతున్నారు. కాబట్టి ఈ చలన విధిస్తున్న పై స్థాయి అధికారులు కావచ్చు కిందిస్థాయి అధికారులు కావచ్చు ఎవరివల్ల తప్పు జరుగుతుందో వారిని ఒక రెండు నెలలు సస్పెండ్ చేయాలి.

దానివల్ల వాళ్లకు కూడా తప్పు చేస్తే సస్పెండ్ అవుతామనే భయం ఉంటుంది కాబట్టి అటువంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. రవాణా చట్టం ప్రకారం వాహనదారులపై ఫైన్లు విధిస్తున్నట్టే ఎటువంటి తప్పులు జరగకపోయినా ఫైన్లు విధించే పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసి ఫైన్లు విధించాలి అని బాధితుడు పోలీస్ వ్యవస్థను అధికారులను, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు.

Related posts

ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న YCP MLAలు

Bhavani

సిపిఐ అభ్యర్థుల గెలుపుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు

Satyam NEWS

రాజౌరి ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి: ముగ్గురు జవాన్ల వీర మరణం

Satyam NEWS

Leave a Comment