Slider నల్గొండ

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైది రెడ్డి జన్మదిన వేడుకలు

#MLA Sanampudi Saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్  ఆధ్వర్యంలో హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  పుట్టినరోజు వేడుకలను ఘనంగా  నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న  యూనియన్ నాయకులు వైద్య ఉద్యోగుల ఆత్మ బంధువు సైదిరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ, డివిజన్ అధ్యక్షులు బందెల రాములు,  ప్రధాన కార్యదర్శి  మామిడి లక్ష్మణ్, బెల్లంకొండ శ్రీనివాస్, ఉదయగిరి శ్రీను, రమావత్ భాస్కర్, ఆశా కార్యకర్తలు  సీత, సబితా, మాలతీ, ఇందిరా, నాగేంద్ర,  సావిత్రి , తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి జన్మదినం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ 7 వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో  గర్భిణీ స్త్రీలకు కు హుజుర్ నగర్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి పౌష్టికాహారం, పండ్లు పంచారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల ఆదిలక్ష్మి, ఇట్టి మల్ల మధు, సోమ గాని ప్రదీప్, అంగన్వాడీ టీచర్ అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిబంధనలు అతిక్రమించిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోండి

Satyam NEWS

ఉత్తమ టైర్ మైలేజీ సాధించిన నరసరాపుపేట ఆర్టీసీ డిపో

Satyam NEWS

రహదారులపై కల్వర్టులు, వాగుల వద్ద జాగ్రత్త గా ఉండాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!