40.2 C
Hyderabad
April 28, 2024 15: 09 PM
Slider ముఖ్యంశాలు

మేడారంలో సీతక్క ప్రత్యేక పూజలు

#seetakka

రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. తాడ్వాయి మండలం లోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతక్క మాట్లాడుతూ ఆసియా లోనే అతి పెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  విజయవంతం అయిన సందర్భంగా వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 6 తేదీన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపడుతున్న పాదయాత్ర మేడారం వన దేవతలను దర్శించుకొని హత్ సే హత్ పాదయాత్ర మొదలవడం జరుగుతుంది అని తెలిపారు.

కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పాదయాత్ర విజయవంతం చేయాలని సీతక్క కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్తా డ్వాయి మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి , ఎండి చాంద్ పాషా  , జిల్లా సీనియర్ నాయకులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ , ములుగు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర , ఎంపీటీసీ నాగలక్ష్మి అనీల్,మాజీ మండల అధ్యక్షులు కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు అరెం లచ్చు పటేల్ , తాండాల శ్రీను , సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ ,వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,తండాల శ్రీను,మాజీ చైర్మన్ పాక సాంబయ్య , మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు, సింగిల్ విండో డైరెక్టర్ యానాల సిద్ది రెడ్డి ,  ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పీరిల వెంకన్న , యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి సుమన్ రెడ్డి, ఊరట్టం గ్రామ కమిటీ అధ్యక్షులు కోటే నరసింహులు , నల్లెల భరత్,గజ్జెల నరేందర్ , సంపత్ , యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు రాజేందర్ , జనగాం నాగరాజు,చంద్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

High alert: టెర్రర్ లింక్ కారణంగా పిఎఫ్ఐ పై నిషేధం  

Satyam NEWS

వైసిపికి భారీ షాకిచ్చినంద్యాల లాయర్ తాతిరెడ్డి తులసిరెడ్డి

Bhavani

ఉత్తరప్రదేశ్ లో మదర్సాల ఆదాయ వనరులపై సర్వే

Satyam NEWS

Leave a Comment