సరూర్ నగర్, లింగోజిగూడా, రోడ్ నెం.3 ధర్మపురికాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 20 సెప్టంబర్ న ఘనంగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎల్.బి.నగర్ నియోజకవర్గం శాసనభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గణపతి పూజా కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఇదే సమయంలో కొందరు మహిళలు వారికి కలిగిన ఇబ్బందులను తెలియపరచుకుంటూ పత్రాన్ని సమర్పించుకున్నారు. మీ సమస్యలను తప్పకుండా త్వరలో పరష్కరిస్తానని ఆయన మాట ఇవ్వటం జరిగింది.
అనంతరం ధర్మపురికాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.ఎస్.రాజు మాట్లాడుతూ కాలనీలో ప్రతిష్టించబడిన గణేశ మంటపానికి సుధీర్ రెడ్డి రావడం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ నవరాత్రులలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగుతాయని విన్నివించుకున్నారు. తదుపరి కాలనీలో మరికొందరు పెద్దలు మూర్తి, వివేకానందమూర్తి, రాకేశ్ కుమార్, శేషగిరిరావు, సురేశ్ కుమారు, కొరుప్రోలు హరనాథ్, బాలం శంకర్, జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం గావించారు.