22.7 C
Hyderabad
February 14, 2025 01: 40 AM
Slider తెలంగాణ

వెరైటీ: బస్సు కాదు గురూ బయో టాయిలెట్టు

rtc 1

పైన మీరు చూస్తున్నది ఆర్టీసీ బస్సు అనుకుంటున్నారా? కాదు. అది బస్సు టాయిలెట్… సారీ.. బయో టాయిలెట్. ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్ లో ఇలా సంచార బయో టాయిలెట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆర్టీసీ ఉద్యోగుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

ఈ సమావేశంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు తమ సమస్య ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై చర్చించిన అనంతరం సిఎం ఆర్టీసీ యాజమాన్యానికి సూచనలు చేశారు. దాంతో సత్వర చర్యలు తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం ఈ బస్సు టాయిలెట్లను రూపొందించింది. మియాపూర్ లోని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ లో దీన్ని తయారు చేశారు. ​

రేపు సంచార బయో టాయిలెట్ ను ప్రారంభించడానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. ​నగరంలో 9  చేంజ్ ఓవర్ పాయింట్స్ లో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు టాయిలెట్ ల అవసరం ఉందని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది.

Related posts

లాక్ డౌన్ ఉన్నంతకాలం పేదలకు ఆహారం అందిస్తా

Satyam NEWS

రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా

Satyam NEWS

దళిత యువకుల పై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి 

Satyam NEWS

Leave a Comment