30.2 C
Hyderabad
February 9, 2025 19: 37 PM
Slider ముఖ్యంశాలు

మోడల్ ఎమ్మెల్యే: మహిళా శక్తితో కరోనాపై పోరాటం

sudheer reddy

ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? ఈ విషయాన్ని ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ని చూసి నేర్చుకోవాలి. సమాజానికి తక్షణ అవసరాలు ఏమిటి? మన వంతు కర్తవ్యంగా మనం ఏం చేయగలం అనేది దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆలోచించి చేస్తున్నారు.

ప్రస్తుతం సమాజం పోరాడాల్సిన కరోనా వైరస్ పై ఆయన దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో సరిపడా మాస్కులు ,శానిటైజర్లు సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో మానవతా దృక్పథంతో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తమ వంతు సహకారంగా లింగోజిగూడా డివిజన్ పరిధిలోని కర్మన్ ఘాట్ కూడలి లోని సుమంగళి గార్డెన్స్ లో ఒక బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావుతో కలిసి ప్రజల అవసరాలు తీర్చడం కోసం నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాలచే దాదాపు 10,000 మాస్కులు,10,000 శానిటైజర్ల తయారీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కరోనా  వైరస్ కేసు నమోదు అయిన నాటి నుంచి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రతిరోజూ పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధించిన అధికారులు, సిబ్బంది తో మమేకమై మాస్కులు, శానిటైజర్ లను ఉచితంగా అందించామని తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు తయారుచేసి మురికివాడల్లో ఉన్న నిరుపేద ప్రజలకు, మున్సిపల్ కార్మికులకు, రోడ్డు మీద ప్రయాణించే వారికి, నియోజకవర్గ పరిధిలోని కాలనీ వాసులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ శుచి,శుభ్రత పాటించడంతో పాటు, కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని సుధీర్ రెడ్డి కోరారు. ముందు జాగ్రత్తలు పాటించి, మనల్ని మనం కాపాడుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని తెలిపారు.

అలాగే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను కొంతమేర అరికట్టినట్టే అని తెలిపారు. అలాగే మన ఇంటి పరిసరాల్లో, చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా పనిచేసి కరోనా వైరస్ ను నిర్మూలించే విధంగా కృషి చేయాలన్నారు.

Related posts

70 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు

Satyam NEWS

దర్శకుడు శ్రీను వైట్ల కి హ్యాపీ బర్త్ డే..

Satyam NEWS

29న రోమ్ వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ

Satyam NEWS

Leave a Comment