40.2 C
Hyderabad
April 28, 2024 18: 24 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి ఏరియా హాస్పిటల్  తనిఖీ చేసిన మంత్రి వేముల

#ministerVemula

“నేను మీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని..ముఖ్యమంత్రి కేసీఆర్ మీ యోగక్షేమాలు తెలుసుకొమ్మని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది. డాక్టర్లు,నర్సులు మీ బాగోగులు చూసుకుంటున్నారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తారు.” అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోవిడ్ తో ఐసియులో చికిత్స పొందుతున్న వారికి భరోసా కల్పించారు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను నేడు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని కోవిడ్ వార్డులోని డ్యూటీ డాక్టర్లను,నర్సులను మంత్రి కోరారు. మీరు అందిస్తున్న చికిత్స కంటే మీరు కల్పించే భరోసాతోనే బాధితులు త్వరగా కోలుకుంటారని మంత్రి అన్నారు. అట్లాగే కోవిడ్ వార్డులో విధుల్లో ఉన్నవారు ఐదుగురు పేషంట్స్ కి ఒకరు బాధ్యులుగా ఉండాలని చెప్పారు. అలా ఐదుగురికి ఒకరు మానిటరింగ్ చేయడం వల్ల పేషంట్ పరిస్థితి కచ్చిత అంచనా మీకు తెలుస్తుందన్నారు.

ప్రతి గంటకు ఒక్కసారి పేషంట్ కండిషన్ రికార్డ్ చేయాలని సూచించారు.ప్రతి రోజు పేషంట్స్ హెల్త్ రిపోర్ట్ జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబి పాటిల్,కామారెడ్డి కలెక్టర్ డా.శరత్,ఎస్పీ శ్వేతా, డిఎంహెచ్ఓ, హాస్పిటల్ సూపరింటెండెంట్ పలువురు ఉన్నారు.

Related posts

కత్వ చెరువులో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిందే

Satyam NEWS

దుబ్బాక ఎన్నికలు సంచులకొద్దీ డబ్బులు…ఎవరివో???

Satyam NEWS

మ్యూజియంల రీ ఇమేజినింగ్ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment