39.2 C
Hyderabad
April 28, 2024 13: 12 PM
Slider ముఖ్యంశాలు

అదేమిటో ఇద్దరూ చెరో రకంగా చెప్పారు

#SajjalaRamakrishnareddy

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు అరెస్టుపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి భిన్నమైన వాదనలు వినిపించడం ఆసక్తికరంగా మారింది.

అచ్చెన్నాయుడిపై అన్యాయంగా హత్యాయత్నం కేసు పెట్టారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న తరుణంలో ఇద్దరు ముఖ్యులు భిన్నవాదనలు వినిపించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్టాడుతూ అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జనానికి పాల్పడ్డారు. కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు….అని తెలిపారు.

అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారు.. అచ్చెన్నాయుడు అరెస్ట్ కు మాకు సంబంధం లేదు. ఎన్నికల కమిషన్ పరిధిలో అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగింది….అని ఆయన స్పష్టంగా చెప్పారు.

‘‘నిమ్మాడలో ఏకగ్రీవం కావాలి. పోటీ వద్దు అని ఎందుకు అడ్డుకున్నారో, ఈ ఘటనపై ఎస్ఈసీ ఎందుకు స్పందించలేదో నిమ్మగడ్డ సమాధానం చెప్పాలి. పైగా అక్కడ దశాబ్ధాలుగా ఏకగ్రీవం ఉంది. అక్కడ ఏకగ్రీవాలు ప్రజాభిమానంతో కాదు.. ప్రజలు నెత్తిన పెట్టుకొని ఎన్నుకున్నవి కాదు. అసలు దశాబ్ధాలుగా ఏకగ్రీవం ఎందుకు ఉందంటే నిమ్మాడలో వరుసపెట్టి హత్యలు జరిగాయి కాబట్టే’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Related posts

నరసరావుపేటలో ఎంఐఎం నేతల నిరసన

Satyam NEWS

రైల్వే సమస్యలపై జీఎంకు వినతి

Bhavani

శ్రీశైలంలో భక్తుల ఉచిత సేవలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్లు

Bhavani

Leave a Comment