38.2 C
Hyderabad
May 2, 2024 22: 09 PM
Slider ప్రత్యేకం

మోదీ పర్యటన ఇలా

#modi

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఒకరోజు పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్కు ప్రధాని చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం లో మోదీకి స్వాగత సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం బేగంపేట నుంచి రామగుండానికి ప్రధాని పయనమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపనలు చేస్తారని తెలిపింది. ఇందులో భాగంగా రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారని పేర్కొంది. రూ.2,200 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి 765పై మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి సెక్షన్‌, ఎన్‌హెచ్‌-161పై బోధన్‌-బాసర-భైంసా సెక్షన్‌, ఎన్‌హెచ్‌-353సీపై సిరొంచా-మహదేవ్‌పూర్‌ సెక్షన్‌ రోడ్డు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పీఎంఓ పేర్కొంది.  అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.  సాయంత్రం రామగుండం నుంచి ప్రధాని  బేగంపేట చేరుకుని ఢిల్లీకి వెళ్తారు.

Related posts

అసత్య ఆరోపణలతో నా పరువుకు భంగం కలిగిస్తున్నారు

Satyam NEWS

30 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదు

Satyam NEWS

వైసీపీ నేత అంబటి కృష్ణ రెడ్డి కి గుండెపోటు

Bhavani

Leave a Comment