37.2 C
Hyderabad
May 2, 2024 12: 51 PM
Slider విశాఖపట్నం

మోడీజీ…రుషికొండను కళ్లారా చూడండి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రుషికొండను కళ్లారా చూడాలంటూ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రుషికొండను కళ్లారా చూడాలంటూ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు. ఏరియల్ సర్వే చేయడం ద్వారా రుషికొండ అక్రమాలు స్వయంగా వీక్షించవచ్చని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతికి భిన్నంగా 3 రాజధానులంటూ సీఎం జగన్‌ వ్యవహరిస్తున్న తీరును లేఖలో అయ్యన్న వివరించారు. అమరావతి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఏకైక జధానిగా అమరావతి కొనసాగుతుందనే స్పష్టతను ప్రధాని ఇవ్వాలని అయ్యన్న ఆకాంక్షించారు. మూడున్నరేళ్లుగా పోలవరం పనులు జరగలేదని, ప్రధాని స్థాయిలో ఓ సమావేశం నిర్వహించి పోలవరం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న విశాఖ పర్యటనకు రానున్నారు. రూ.10,472 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 61 ఎకరాల రుషికొండ ‘హిల్‌ ఏరియా’లో 9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకు ఏపీటీడీసీ అనుమతి తీసుకోగా క్షేత్ర స్థాయిలో దీనికి రెండింతల తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తోంది. కొండ మధ్యలో చిన్న భాగం తప్ప మిగిలిన అంతటా భారీగా తవ్వేశారు. శిఖర భాగాన్ని వదిలి చుట్టూ తవ్వకాలు జరిపారు. అటవీశాఖ 139 చెట్లు తొలగించినట్లు పేర్కొనగా వందల సంఖ్యలో చెట్లను తొలగించినట్లు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు అందజేత

Satyam NEWS

ఎల్ బి నగర్ లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ లో దారుణం

Satyam NEWS

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దాతృత్వం

Satyam NEWS

Leave a Comment