26.7 C
Hyderabad
May 3, 2024 07: 49 AM
Slider ముఖ్యంశాలు

కరోనా ఎఫెక్ట్: ఎన్నికలను రద్దు చేస్తున్న మరిన్ని రాష్ట్రాలు

corona virus 16

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు అదే బాటలో పయనిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 12 నుంచి 26వ తేదీ వరకూ జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ సమర్థించాయి. పశ్చిమ బెంగాల్ బిజెపి రాష్ట్ర శాఖ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించింది.

కరోనా వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేసే దిశగా తమ పార్టీ చర్యలు చేపడుతుందని ఆయన ప్రకటించారు. కరోనా కారణంగా మహారాష్ట్రలో అన్నిరకాల ఎన్నికలు 3 నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఎక్కువ కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి.

మొత్తం 32 కేసులను అక్కడ గుర్తించారు. దేశంలోని 19 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ పాక్షిక బంద్ పాటిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో పాఠశాలలు మూసేశారు.

ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమి కూడకుండా కేరళ, కర్నాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలలో నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు. ఎక్కువ మంది మనుషులు గుమికూడకుండా ఉండే చర్యలలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పర్యటనలు రద్దు చేసుకున్నారు.

ఇప్పటికే తెలంగాణ లో పబ్బులు, క్లబ్బులు మూసివేయగా, వివాహ కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. చండీగఢ్ లో కూడా నేడు దాదాపుగా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఎక్కడా గుంపులు గుంపులుగా జనం గుమి కూడకుండా ఉండాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులకు వచ్చే వారి సంఖ్య తగ్గే విధంగా డిజిటల్ లావాదేవీలను పెంచాలని రిజర్వు బ్యాంకు ఆదేశించింది.

Related posts

ప్రశాంత వాతావరణంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ

Satyam NEWS

గార్ల మండల కేంద్రంలో కొమురం భీం విగ్రహావిష్కరణ

Bhavani

నేడు ఎలోన్ మస్క్ 51వ పుట్టిన రోజు

Satyam NEWS

Leave a Comment