నిర్మల్ లో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అక్కడ ఇప్పటి కే ఉన్న సమాధులను తొలగించామని దీనిపై సంబంధిత కుటుంబాల వారు బాధ పడవద్దని హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అయ్యానగారి రాజేందర్, కార్యదర్శి అడపా పోశెట్టి కోరారు.
గత 30 సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక పోవడం వల్ల ఎంతో ఇబ్బందిగా ఉందని అందువల్ల ఉన్న స్మశాన వాటికనే అభివృద్ధి చేయాల్సి రావడం వల్ల సమాధులను తొలగించామని వారు తెలిపారు. హిందూ స్మశాన వాటిక నిర్మించుకోవడానికి నిధులు అందుబాటులో ఉంచినా గత ఐదు సంవత్సరాలుగా ఏ పనీ చేయలేకపోయామని వారు అన్నారు.
సమాధులు ఉన్నందున వాటిని తొలగించడం భావ్యం కాదని ఇంత కాలం భావించామని అయితే ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని వారన్నారు. స్మశాన వాటిక పనులను 20 లక్షల రూపాయల ఖర్చుతో రెండు రోజుల్లో చేపట్టబోతున్నట్లు వారు ప్రకటించారు.