తెలుగుదేశం పార్టీకి కుల పిచ్చి లేదని ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి అందరూ రెడ్లనే దగ్గర పెట్టుకున్నారని, వారికే పదవులు ఇచ్చారని ఆయన విమర్శించారు.
నా రాజకీయ జీవితం లో ఇటువంటి దౌర్భాగ్య ఎన్నికలను చూడలేదు. ఇలాంటి ఎన్నికలను వాయిదా వేయడం కాదు రద్దు చేయాలి అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ అధికారాలు ముఖ్య మంత్రి జగన్ కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. నిన్న ప్రెస్ మీట్ లో ముఖ్య మంత్రి మాట తీరు చూస్తే అతని నిజాస్వరూపం బయటపడిందని, ముఖ్య మంత్రి వ్యవహార శైలి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు.
రాష్ట్రం లో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత పోలీసులుతో ఎన్నికలు సజావుగా జరుగుతాయని తమకు నమ్మకం లేదని అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని కేంద్ర బలగాలు తో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.