38.2 C
Hyderabad
April 29, 2024 14: 57 PM
Slider జాతీయం

దేశంలో పెరుగుతోన్న ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 100 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు విస్తరించిందని.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ తర్వాత రాజస్తాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 గుజరాత్‌లో 5 కేరళలో 5 కేసులు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదూనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారి నుంచి ఈ వేరియంట్‌ మన దేశంలోకి వచ్చేసింది. ఈ నెల మొదటి వారంతో మన దేశంలోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. బయటి వచ్చిన వారికి నిర్ధారణ పరీక్షల ద్వారా సేకరించిన నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపిన తర్వాత 3 రోజులకు కానీ ఫలితాలు రావడం లేదు.. ఈలోగా వారి నుంచి మరి కొందరికి ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.

Related posts

పాలియేటీవ్ కేర్ కు SBI ఫౌండేషన్ భారీ విరాళం

Satyam NEWS

ఏ మాత్రం ఆత్మాభిమానం లేని లక్ష్మీపార్వతి

Satyam NEWS

న్యూ ఎజెండా: గ్రామాలలో పరిశుభ్రత తాండవించాలి

Satyam NEWS

Leave a Comment