27.7 C
Hyderabad
May 14, 2024 07: 46 AM
Slider సంపాదకీయం

రాజశ్యామల యాగానికి ఆహ్వానం అందలేదా? ఎగ్గొట్టారా?

#rajashyamalayagam

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం జగన్ వ్యక్తిగత మేలు కోసం నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొనేందుకు మంత్రులను ఆహ్వానించారా? దేవాదాయ శాఖ మంత్రితో సహా ఐదుగురు తప్ప వేరెవరూ హాజరు కాకపోవడంతో ఈ అనుమానం కలుగుతున్నది. పిలిచినా కూడా మంత్రులు ఎవరూ రాలేదా అని కూడా మరి కొందరు అనుమానిస్తున్నారు.

సీఎంగా జగన్ కొనసాగాలనే ఆకాంక్షతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ యాగాన్ని ప్రభుత్వ ఖర్చుతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు పైకి చెబుతున్నా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ యాగం నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పరంగా ఈ యాగం నిర్వహిస్తున్నందున దీనికి ప్రోటోకాల్ ప్రకారం మంత్రులను కూడా ఆహ్వానించాల్సి ఉంటుంది.

అయితే దేవాదాయ శాఖ మంత్రి, ఇద్దరు మహిళా మంత్రులు, మరో ఇద్దరు మంత్రులు తప్ప వేరెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. హాజరైన వారిలో మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్, తానేటి వనిత మాత్రమే ఉన్నారు. మంత్రులకు అసలు ఆహ్వానమే పంపలేదని తెలిసింది. ఆహ్వానం లేకపోవడంతో మంత్రులందరూ ఈ యాగానికి దూరంగా ఉన్నారు. ఆహ్వానం లేకపోవడం వల్ల యాగానికి వెళితే రానిస్తారో రానివ్వరో అని కొందరు మంత్రులు అనుమానంతో ఆగిపోయారు.

మరి కొందరు మంత్రులైతే ఆహ్వానం లేకుండా ఎలా వెళతాం, మాకు మాత్రం ఆత్మాభిమానం ఉండదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రులు కూడా ఒకరి కొకరు ఫోన్ చేసుకుని ఆహ్వానం ఎవరికైనా వచ్చిందా అని చర్చించుకున్నట్లు కూడా తెలిసింది. ప్రభుత్వ పరంగా నిర్వహించే ఆ యాగానికి తమను ఆహ్వానించకపోవడం తమను తీవ్రంగా అవమానించడమేనని కూడా కొందరు భావిస్తున్నారు.

ఏదో వేరే జిల్లాలో అయితే సర్దు కోవచ్చు కానీ రాజధానిగా భావించే విజయవాడలో యాగం జరుగుతున్న సమయంలో మంత్రులను ఆహ్వానించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చండీ, రుద్ర , రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం జగన్ ఒక్కరే పాల్గొన్నారు. ఆయనతో బాటు ఆయన సతీమణి భారతీరెడ్డి హాజరు కాలేదు. భార్య పక్కన లేకుండా యజ్ఞం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరదని పండితులు చెబుతున్నారు.

Related posts

పేద‌ల కోస‌మే బస్తీ దవాఖానాలు

Murali Krishna

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

Bhavani

రామప్ప దేవాలయం అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment