33.7 C
Hyderabad
April 30, 2024 00: 51 AM
Slider వరంగల్

రామప్ప దేవాలయం అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాలి

#ministerkishanreddy

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. ములుగు జిల్లాలోని  వెంకటాపూర్ మండలం లోని రామప్ప దేవాలయానికి ఈ ఏడాది జూలై 25న యునెస్కో గుర్తింపునిచ్చిందని ఆమె గుర్తు చేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ప్రసిద్ధ దేవాలయం, శిల్ప సంపద కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తు చేశారు.

ప్రపంచ ప్రసిద్ది చెందిన ఈ శివుని దేవాలయాన్ని అభివృద్ధి పరచడం ప్రభుత్వాల బాధ్యత అని ఆమె అన్నారు. రామప్ప దేవాలయం వద్దఅధునాతన సౌకర్యాలతో  కూడిన కాటేజీలను నిర్మించాలని, వివిధ దేశాల పర్యాటకులు వస్తారు కాబట్టి హైదరాబాద్, హన్మకొండ లాంటి ప్రాంతాల నుండి బస్సులు నడిపించాలని సీతక్క కోరారు. రామాప్ప ఆలయంతో పాటు అక్కడ ఉన్న 10 ఉపాయాలకు పూర్వ వైభవం  తీసుకొనిరావాలని ఆమె కోరారు. స్టానికులకు ఉపాధి కల్పించడం కోసం దుకాణ సముదాయ భవనాలు ఏర్పాటు చేయాలని సీతక్క కోరారు.

రామప్ప అభివృద్ది కోసం ప్రత్యేక ఐ‌ ఏ‌ ఎస్ అధికారిని నియమించి కమిటీ లో  స్టానికులకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు. పార్కింగ్ స్థలాన్ని ఆధునీకరించి పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చూడాలని, పర్యాటకులకు  ఆరోగ్య సమస్యల దృష్టిలో ఉంచుకుని 30 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, రామప్ప పరిసర ప్రాంతాలలో సత్రాలు, త్రాగు నీరు మరుగుదొడ్లు ఏర్పాటు చేయలని సీతక్క కోరారు.

రామప్ప తూర్పు రోడ్డును వినియోగించి ఆలయం చుట్టు రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని, అభివృద్ది  పనుల్లో అక్రమాలకు తావులేకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తో పాటు అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు జెడ్పీటీసీ ఎంపీటీసీ లు సర్పంచులు సహకార సంఘం చైర్మన్ లు గ్రామ మండల జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్రహ్మచారిణిగా బాసర జ్ఞాన సరస్వతి

Satyam NEWS

రాజంపేట లో అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్ అరెస్ట్

Satyam NEWS

రైతులు మై ట్రాక్టర్ ఇండియా సేవలను వినియోగించుకోవాలి

Satyam NEWS

Leave a Comment