29.7 C
Hyderabad
May 1, 2024 05: 41 AM
Slider ఖమ్మం

ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమo

#aisf

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఐదువేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ మెంట్,  స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రభుత్వంను  డిమాండ్ చేశారు.  ఖమ్మం  ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ప్రదర్శనగా కలెక్టరేట్ కి చేరుకొని ముట్టడి చేశారు.  అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి విద్యార్థి నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమ ప్రభుత్వానికి పట్టట్లేదని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్  విడుదల కాకపోవడంతో విద్యార్థులు మానసిక ఆవేదనకు గురవుతున్నారు అన్నారు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు ఉండడంతో ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నయన్నారు.

 ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న 5000 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇంతవరకు  హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదని వెంటనే విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు.  సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాల బాట పట్టక తప్పదని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికాల రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్, సుభాని, యువరాజ్, మధు , సందీప్ కౌశిక్  పవన్ గౌతమ్ నాగులు మేరా  శివ ఉజ్వల్ నరేష్ గోపి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాయకపోడు కులస్తుల గణేష్ ఉత్సవంలో పాల్గొన్న డిఎస్పీ

Satyam NEWS

దటీజ్ మోడీ: అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని

Satyam NEWS

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment