38.2 C
Hyderabad
April 29, 2024 20: 25 PM
Slider ఖమ్మం

మోడీ రాకను నిరసించండి  

#cpicpm

తెలంగాణ రాష్ట్రానికి నిధుల ఇవ్వకుండా, పన్నుల వాటాన్ని సక్రమంగా పంచకుండా రాష్ట్రంపై వివక్షత చూపే నరేంద్ర మోడీ రాకను ప్రజలు నిరసించాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్, నున్న నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశానికి కట్టే పన్నుల్లో రాష్ట్రానికి రావలసిన వాటా విషయమై ప్రధాని మోడీ వివక్షత చూపుతున్నారనివారు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పన్నుతో ఉత్తర భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ దక్షిణ భారతదేశ పై చవితి తల్లి ప్రేమను చూపిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. 8 సంవత్సరాల కాలంలో మోడీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని,  రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి కుడా  లేదా  అని వారు ప్రశ్నించారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభమై సంవత్సరం కాలం తరువాత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించడం ఏమిటని ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని వారు దుయ్యబట్టారు.

ఈనెల 12వ తేదీన మోడీ రాకను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఖమ్మం  పాత బస్టాండ్ సెంటర్లో సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి రెండు పార్టీల కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్ర శ్రీకాంత్,  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, కొండపర్తి గోవిందరావు,  తాటి వెంకటేశ్వర్లు, తోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగిత్యాల పట్టణ శివారు గ్రామాలను మాస్టర్‌ ప్లాన్‌ నుండి మినహాయిస్తాం

Bhavani

నిధులు వచ్చేనా..? పనులు సాగేనా..?

Satyam NEWS

వనపర్తి లో మినీ హజ్ హౌస్ కు రూ. కోటి మంజూరు

Satyam NEWS

Leave a Comment