29.7 C
Hyderabad
May 1, 2024 09: 12 AM
Slider ముఖ్యంశాలు

మా సొమ్ము మాకే ఇస్తూ మీ ఫోజులేంటి ఎంపీలూ

Parliament

దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆ పార్లమెంటు సభ్యుడు ఇంత ఇచ్చాడు, ఈ పార్లమెంటు సభ్యుడు అంత ఇచ్చాడు అనే వార్తలు చూస్తున్నాం. చాలా సందర్భాలలో ఈ పార్లమెంటు సభ్యులు ఇస్తున్నది తమ ఎంపి లాడ్స్ నిధుల నుంచి మాత్రమే అనేది కఠోర సత్యం.

వీరంతా సొంత డబ్బులు సాయం చేయడం లేదు. కరోనా కట్టడి కోసం తమ ఎంపిలాడ్స్ నిధుల నుంచి స్థానిక సంస్థలు ఉపయోగించుకోవాలని చెబుతూ ఎంపిలు సంబంధిత జిల్లా కలెక్టర్లకు, మునిసిపల్ కమిషనర్ లకు లేఖ లు ఇస్తున్నారు.

ఇది తాము తమ సొంత డబ్బులు ఇస్తున్నట్లు ఫొటోలు తీయించుకుని పత్రికలలో వేయించుకుంటున్నారు. ఎంపి లాడ్స్ నిధులు ప్రజల సొమ్మే. వారు సొంతగా ఇస్తున్నది కాదు. తెలుగు రాష్ట్రాలలోని ఎంపిలు సొంత డబ్బులు ఇచ్చిన వారు తక్కువే. ఇలా మంది సొమ్ము పందారం చేసిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.

దేశంలో ప్రస్తుత పార్లమెంటులో దాదాపు 70 శాతం మంది కోటీశ్వరులున్నారు. వంద కోట్లకు పైబడి ఆస్తులు ఉన్న వారు లెక్కకు మించి ఉన్నారు. వెయ్యి కోట్ల ఆస్తులు దాటిన ఎంపిలూ ఉన్నారు. ఆర్ధిక నేరాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా మన దేశంలో కొదవేం లేదు.

ఎంపిలు అందరూ తమ సొంత సొమ్ము ఇవ్వకపోవడం ఇక్కడ గమనార్హం. ఎంపిలాడ్స్ ఇవ్వాళ కాకపోతే రేపు ప్రజలకు ఖర్చు చేయాల్సిందే. అది మీరు ఇప్పుడు ఇవ్వడం గొప్ప కాదు ఎంపిలూ. సొంత డబ్బులు ఇవ్వండి. అప్పుడు పత్రికల్లో ఫొటోలు వేయించుకోండి.  

బాధ్యతగల ఒక పౌరుని వినతి

Related posts

మందు బాబులకు షాక్

Murali Krishna

భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రూరల్ సీఐకి సత్కారం

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment