40.2 C
Hyderabad
May 1, 2024 16: 48 PM
Slider నల్గొండ

ఏపి సిఎం జగన్ తో కలిసి తెలంగాణ సిఎం కేసీఆర్ నాటకం

#MP Komatireddy Venkatreddy

ఏపి సిఎం జగన్, తెలంగాణ సిఎం కేసీఆర్ కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచే విషయంలో కమీషన్ల కోసమే ఇన్నాళ్లు కేసీఆర్ మౌనం పాటించారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏడేళ్లుగా సీఎంగా ఉంటున్న కేసీఆర్ తెలంగాణకు ఏం మేలు చేస్తున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

గత డిసెంబర్ లోనే ఏపీ అసెంబ్లీలో 80వేల క్యూసెక్కులతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేయనున్నట్లు ఏపి సిఎం జగన్ చెప్పారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. అయినా అప్పుడే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

జీవోపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పినా కూడా కేసీఆర్ కు నోరు విప్పలేదని ఆయన విమర్శించారు. తాము అంశాన్ని లేవనెత్తకముందు కృష్ణా రివర్ బోర్డుకు ఇన్నాళ్లు లేఖ ఎందుకు రాయలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ పై తమకు నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం

ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గాన్ని ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి చేయలేదని ఎంపి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను కేసీఆర్ మూలకు పడేసారని, డిండి ఎత్తిపోతల పథకంలో 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు.

దక్షిణ తెలంగాణ లో పనికి రాని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని, వాళ్లకు అడిగే ధైర్యం లేదని కోమటిరెడ్డి అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల లకే సీఎంగా కేసీఆర్ పని చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. గోదావరి, కృష్ణా అనుసంధానం పేరుతో మళ్ళీ 50, 60 వేల కోట్ల రూపాయల కమిషన్ల కోసం కేసీఆర్ డ్రామా మొదలు పెట్టారని ఆయన అన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ముగ్గురం ఎంపీలం కలిసి ప్రధానికి ఈ అంశంపై ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

Related posts

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి నీరు విడుదల

Satyam NEWS

మహబూబాబాద్ ఎస్పీగా చంద్రమోహన్

Bhavani

ములుగు జిల్లా లోని రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందించాలి

Satyam NEWS

Leave a Comment