26.7 C
Hyderabad
April 27, 2024 08: 09 AM
Slider కవి ప్రపంచం

ఎలా స్వాగతించాలి…?

#TirunagariSrinivas

ఒళ్ళంతా కన్నీళ్లే

సంక్రాంతినెలా స్వాగతించాలి ?

ప్రతిచోటా ప్రాణరక్షణ పోరాటమే

సంక్రాంతినెలా స్వాగతించాలి ?

చుట్టూరా అభద్రతా వలయమే

సంక్రాంతినెలా స్వాగతించాలి ?

 కరోనా ఒంటరితనాన్ని అంటగట్టింది

సంక్రాంతినెలా స్వాగతించాలి ?

ఆగక ప్రవహించే నది కాలమే

పరిణామమూ ఆపలేనిదే

మనిషికున్న ఆస్థి ఆశే కదా…!

ఆత్మనిబ్బరం అజేయమై

కత్తెర వడగాలుల్ని నియంత్రిస్తుంది

భవిష్యత్తు పచ్చిక బయలై

మళ్ళీ ఆకుపచ్చగా మెరుస్తుంది

పరవశమై పరుగులెత్తుతుంది

గొంతు కొత్తదనాన్ని అద్దుకొని అప్పుడు

పండుగను సంబురంతో పిలుస్తుంది.

-తిరునగరి శ్రీనివాస్, 8466053933

Related posts

మేళ్లచెరువు మండలంలో కలెక్టర్ పర్యటన

Satyam NEWS

లాక్ డౌన్ సమయంలో పేదలు పస్తులు ఉండవద్దు

Satyam NEWS

దేశ శ్రేయస్సు కోసం పాటుపడిన మహానీయుడు రాజీవ్ గాంధీ

Bhavani

Leave a Comment