37.2 C
Hyderabad
May 2, 2024 14: 30 PM
Slider ప్రత్యేకం

ఏపి బీజేపీ నుంచి మరో వికెట్ అవుట్: సోమూ ఏ క్యాహై?

#kannalaxminarayana

భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మరో పెద్ద దెబ్బ తగలబోతున్నది. మాజీ ఎమ్మెయ్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి వైదొలగబోతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నది. కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే బీజేపీ నుంచి వైదొలగి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు ఈ నెల 23వ తేదీన ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణతో విష్ణుకుమార్ రాజు సమావేశం కావడం సంచలనం కలిగిస్తున్నది. బీజేపీ నేతలతో మాట్లాడే తీరిక అధిష్టానానికి లేదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రకటించడం మరింత సంచలనం రేపుతున్నది. ఏపీ బీజేపీలో పరిస్థితులు బాగోలేవు. ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఆయన ప్రకటించడంతో ఆయన ఇక బీజేపీని వీడేందుకు సిద్ధపడ్డారనే విషయాన్ని రుజువు చేస్తున్నది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెత్తు పోకడలు పోతున్నారని, పార్టీలో ఎవరిని కలుపుకుని వెళ్లడం లేదని కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎంతో ఇష్టం ఉన్నా కూడా సోము వీర్రాజు వ్యవహరిస్తున్న తీరు పట్ల విసిగిపోయి పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ తో కలిసి బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో మంది నేతలు సిద్ధంగా ఉన్నారు. బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అంబేద్కర్

కోనసీమ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులు అరిగెల వెంకటరామారావు మీడియాకు తెలిపారు. ఈ నెల 23 వ తేదిన బిజిపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు  కన్నా లక్ష్మీ నారాయణ తో పాటు రామారావు టిడిపి గూటికి వెళుతున్నట్లు రామారావు తెలిపారు. విష్ణుకుమార్ రాజు ఇప్పటి వరకూ తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు బహిరంగంగా వెల్లడించకపోయినా కూడా ఆయన ఆది నుంచి తెలుగుదేశం వైపే ఉన్నారు.

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినా కొన్ని కారణాలతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరలేకపోయారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పై పోటీ చేస్తారని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన కూడా కన్నా లక్ష్మీనారాయణతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధం అయ్యారని అంటున్నారు. మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ పార్టీకి ఒక్క సారిగా విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇప్పటికే అధికార వైసీపీపై ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఈ చేరికలు తెలుగుదేశం పార్టీకి ఎంతో లాభిస్తాయి.

Related posts

మహిళా అధికారులు వృత్తి ప్రావీణ్యం పెంపొందించుకోవాలి

Satyam NEWS

మెగాస్టార్ ఆశీర్వాదాలు తీసుకున్న సోము వీర్రాజు

Satyam NEWS

క‌ల్వ‌కుంట్ల క‌మీష‌న్ రావులు వారే!!!

Sub Editor

Leave a Comment