37.2 C
Hyderabad
May 6, 2024 12: 40 PM
Slider వరంగల్

ఐదో రోజు కొనసాగుతున్న రైతు సంఘాల రిలే నిరాహార దీక్షలు

#Mulugu Farmers

ములుగు జిల్లా కేంద్రంలో AIKSCC ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా ఈ దీక్షలు కొనసాగుతున్నాయి ఈరోజు దీక్షలో తెలంగాణ రైతుకూలి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పీర్ల పైడి ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి భారతదేశ వ్యవసాయాన్ని అదానీ అంబానీ కార్పొరేట్ చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశ వ్యవసాయ 80% సన్న చిన్నకారు రైతుల తో ముడిపడి ఉన్నదని, భారతదేశానికి కార్పొరేట్ వ్యవసాయం అవసరంలేదని ఆయన అన్నారు.

అది కనుక అమలు జరిగితే దేశంలో రైతులు రైతు కూలీలు వ్యవసాయ ఆధారిత ఆధారపడి ఉన్నచిన్న చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారిపై జాలి ఉంటే రుణ విమోచన చట్టాన్ని పార్లమెంట్లో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 రైతు వ్యతిరేక చట్టాల గురించి రైతాంగానికి వివరించి ఢిల్లీలో జరుగుతున్నఉద్యమానికి మద్దతుగా జిల్లాలో కూడా పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సన్న వడ్లు పెట్టమని చెప్పి ఈరోజు మొహం చాటేసిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ములుగు జిల్లా కార్యదర్శి పల్లె బోయిన స్వామి అధ్యక్షులు కొత్తపెళ్లి యాకూబ్ ఇనుగాల శ్రీను పొన్నం చందర్ మాట్ల కొమురయ్య వెంబడి ముత్యాలు పాల్ యాదగిరి వల్లే రవి జనగాం విజయ మచి పాక వెంకటేష్ వసంత అక్క తదితరులు పాల్గొన్నారు.

Related posts

బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం.. 8 మంది..

Sub Editor

మార్చి నాటికి 13 విమానాశ్రయాల ప్రైవేటీకరణ

Sub Editor

కోటప్పకొండ అభివృద్ధికి కేంద్ర మంత్రి సహకారం

Satyam NEWS

Leave a Comment