40.2 C
Hyderabad
May 1, 2024 15: 55 PM
Slider నల్గొండ

రైతుల పట్ల ప్రధాని పట్టనట్లు వ్యవహరించటం తగదు

#Hujurnagar Farmers

కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని,దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా రైతులందరూ సంఘటితం కావాలని సూర్యాపేట జిల్లా రైతు సంఘం జిల్లా నాయకుడు పులి చింతల వెంకటరెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు CPM, రైతు సంఘం నాయకుల నాయకత్వంలో కేంద్ర  ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని గత 23 రోజులుగా ఢిల్లీ నగరంలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా శుక్రవారం హుజూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం తాసిల్దార్ జయశ్రీ కి వినతి పత్రం అందజేశారు.

అనంతరం సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నాగారపు పాండు మాట్లాడుతూ  సుప్రీంకోర్టు, ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం, పంజాబ్ లో డీజీపీ రాజీనామా, రోజు రోజుకి ఢిల్లీ రైతులకు మద్దతుగా దేశం ఏకమవుతుంటే, మోడీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. నల్ల చట్టల రద్దు అయ్యేంత వరకు జరిగే పోరాటంలో రైతులు, కార్మికులు, మేధావులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, 14వ, వార్డు కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి, వెంకటేశ్వర్లు, CPM పార్టీ, ప్రజా సంఘాల నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెలుగులు విరజిమ్మనున్న వెంకటగిరి

Bhavani

విజ‌య‌న‌గ‌రం పోలీసుల అదుపులో సెంచ‌రీ దొంగ‌@114 థెప్ట్స్..!

Satyam NEWS

ట్రాప్ చేసి… పులిని పట్టి… దాని చర్మం, గోళ్లు అమ్మకానికి…

Satyam NEWS

Leave a Comment