37.2 C
Hyderabad
April 26, 2024 21: 21 PM
Slider వరంగల్

మొదలైన మేడారం వనదేవతల దర్శనం..

medaram jathara

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారక్కలను భక్తులు దర్శించుకునేందుకు ఇక్కడి పూజారులు అనుమతించారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న కారణంగా ఏప్రిల్‌లో అమ్మవార్ల దర్శనాలను ఆపివేశారు. అన్‌లాక్‌లో ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాలను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తెరిచేందుకు అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో మేడారంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్‌ నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని, గ్రామంలో కరోనా ప్రబలే అవకాశముందని నవంబర్‌ 10 వరకు దర్శనాలను నిలిపివేశారు.

అయితే, ప్రభుత్వ అనుమతులతో మరోసారి అమ్మవార్ల దర్శనానికి పూజారులు ఏర్పాట్లు చేశారు. గుడి మూసి ఉన్నా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడం, బయటి నుంచే దర్శించుకుని వెళ్తుండడం, కార్తీక మాసం కావడంతో గుడిని తెరిచేందుకు నిర్ణయించారు. బుధవారం అమ్మవార్లకు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులకు అనుమతిచ్చారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని దేవాదాయ శాఖ అధికారులు కోరుతున్నారు.

Related posts

Thanks: చీఫ్ జస్టిస్ రమణ చొరవతో పెరిగిన జడ్జిల సంఖ్య

Satyam NEWS

ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిలో ధైర్యం నింపిన బండి సంజయ్

Satyam NEWS

నందమూరి తారక రామారావు అంటేనే ఒక స్ఫూర్తి

Satyam NEWS

Leave a Comment