30.7 C
Hyderabad
April 29, 2024 03: 41 AM
Slider వరంగల్

వర్షాకాలం సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండండి

#Mulugu MPP

చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయడం వల్ల గ్రామాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకోవచ్చునని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ అన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా నేడు ఆమె ములుగు లో తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ఖాళీ స్థలంలో వర్ష కాలం నీళ్లు నిలిచే అవకాశం ఉందని, ఇలా జరిగితే రోగ కారక క్రిములు వ్యాప్తి చెందుతాయని ఆమె తెలిపారు.

అందువల్ల ఎక్కడా కూడా నీరు నిల్వ కూడదని ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.

అదే విధంగా పిచ్చిమొక్కలు వ్యాప్తి చెందడం ద్వారా కూడా మన ఆరోగ్యం పాడైపోతుందని అందువల్ల వాటిని కూడా నిర్మూలించుకోవాలని ఆమె సూచించారు.

అందరూ కూడా ఎవరి దగ్గర వారు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్య తెలంగాణ వైపు ఆగుడులు వేయాలని ఎంపీపీ శ్రీదేవి సుధీర్ అన్నారు.

ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య మెరుగు నగేష్ MRO సత్యనారాయణ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి పెట్రోల్ బంకులో సిసి కెమెరాలు పెట్టాలి

Satyam NEWS

బంజారా హిల్స్ లో స్వేచ్ఛగా తిరిగిన చిరుత

Satyam NEWS

రాష్ట్ర విభజన కంటే రాజధాని మార్పు పెద్ద అన్యాయం

Satyam NEWS

Leave a Comment