38.2 C
Hyderabad
April 29, 2024 13: 45 PM
Slider మహబూబ్ నగర్

జెండా ఎగరేస్తున్న కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి

#KollapurMunicipalChairmen

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా  మున్సిపల్ కార్యాలయంలో భారత త్రివర్ణ పథకాన్ని  మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్ర శేఖర చారి ఎగరవేయనున్నారు.

మున్సిపల్ ఎన్నికల అనంతరం మున్సిపల్ చైర్మన్ గా  మొట్టమొదటిసారిగా శనివారం 74వ భారత స్వతంత్ర దినోత్సవ  జండాను మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఎగరేస్తారు. ఇది వరకు రాష్ట్ర అవతరణ జెండాను ఎగురవేశారు కానీ పంద్రా ఆగస్ట్ న జాతీయ జెండాను ఎగురవేయ్యడం ఇది మొదటిసారి.

ఈ సందర్భంగా  మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి  నూతన దుస్తులు  పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళ సిబ్బందికి చీరలు, మగవాళ్లకు కార్యాలయానికి ఖాకీ యూనిఫామ్ ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరువుతునట్లు చెప్పారు.

ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఆమె చెప్పారు. అదే విధంగా కరోనా లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులకు గురైయిన విధి విక్రేయధారులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేయిల రుణాల చెక్కులను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేయనున్నారని చైర్మన్ విజయలక్ష్మి చంద్ర శేఖర చారి తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వెంకటయ్య తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల10 నిమిషాలకు జాతీయ త్రివర్ణ పతాకాన్ని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి చంద్ర శేఖర చారి ఎగురవే నున్నట్ల కమిషనర్ వెంకటయ్య చెప్పారు.

సోషల్ డిస్టెన్స్ పాటించి స్వతంత్ర దినోత్స కార్యక్రమాన్ని పూర్తిచేస్తున్నట్లు చైర్మన్ విజయలక్ష్మి చంద్ర శేఖర చారి తెలిపారు.

Related posts

బీజేపీ నేతలతో పవన్ వరుస భేటీలు

Bhavani

తెలంగాణ రన్’ కార్యక్రమంలో సీబీఐటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు

Bhavani

ఢిల్లీలో మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి నేతలు

Satyam NEWS

Leave a Comment