38.2 C
Hyderabad
April 29, 2024 11: 44 AM
Slider మెదక్

జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి

#CPI

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా హిమాయత్ నగర్ లో సిపిఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి 2018 లోనే పూర్తయింది. జహీరాబాద్ పట్టణ శివారు గ్రామాలైన పస్తపూర్, రంజోలు, చిన్న హోతి, అల్లిపూర్, చిన్న హైదరాబాదులను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది.

ఈ సందర్భంలోనే చిన్న వతి గ్రామానికి చెందిన ప్రజలు ఆ గ్రామాన్ని విలీనం చేయొద్దని కోర్టుకు వెళ్లగా కోర్టు 20 22 జనవరి 27వ తేదీన ఆ గ్రామాన్ని కూడా కలుపుతూ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల

కమిషన్కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహించాలని జహీరాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్

చేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా లేఖ రాయడం జరిగిందని వెల్లడించారు.

Related posts

‘‘అశ్లీల సిఐ’’ ని కాపాడుతున్న గుంటూరు పోలీసు పెద్దలు

Satyam NEWS

కరోనా కాలానికి ముగింపు!

Sub Editor

సంబంధంలేని విషయంలో జర్నలిస్టు భూమేష్ నే వేధిస్తున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment