31.2 C
Hyderabad
May 3, 2024 01: 13 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు మునిసిపల్ వర్కర్లను పర్మినెంటు చేయాలి

#eluru municipality

ఏలూరు నగర  మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను ఆప్కాస్ నుండి మినహాయించి పర్మినెంట్ చేయాలని, 60 సంవత్సరాలు నిండాయనే పేరుతో పనులనుండి నిలిపివేసిన వారిని పనుల్లోకి తీసుకోవాలని, 60 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనెఫిట్స్ ఇవ్వాలని కార్మికులు నగర కార్పొరేషన్ కార్యాలయం దగ్గర శుక్రవారం ధర్నా నిర్వహించారు.

రిటైర్మెంట్ అయిన, విధులలో ఉండగా మృతిచెందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ  మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు బి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన  హామీ అమలు చేయాలని, ఆప్కాస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

60 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనెఫిట్స్ ఇచ్చిన తరువాతే రిటైర్ చేయాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పారిశుద్ధ్య విభాగం కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు నెలల బకాయి హెల్త్ అలవెన్స్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు ఐదు నెలలు బకాయి జీతాలు ఇవ్వాలని కోరారు.

ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమీషనర్ కి  సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు నాయకులు బి జగన్నాధరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు అంగులూరి జాన్ బాబు, లావేటి కృష్ణారావు, నాయకులు పీక చిట్టయ్య, పంతం నాగరాజు, బి.జనార్ధన, నరమామిడి నాగమణి, ఆముదాల ఏసురత్నం, దౌలూరి సోమరాజు, తానంకి జార్జి, పట్టా లక్ష్మీ, లావేటి లక్ష్మి, బంగారు సీత తదితరులు నాయకత్వం వహించారు.

Related posts

గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Bhavani

నీలాచలం కొండ వద్ద స్పృహ తప్పిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

Satyam NEWS

ఆటో డ్రైవరు నిజాయితీతో బాధితులకు చేరిన బ్యాగులు

Satyam NEWS

Leave a Comment