38.2 C
Hyderabad
April 29, 2024 14: 55 PM
Slider విజయనగరం

ఆటో డ్రైవరు నిజాయితీతో బాధితులకు చేరిన బ్యాగులు

#vijayanagarampolice

విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో మరోసారి పోలీసులు తమ నిజాయితీ ని చూపించారు. తాజాగా మరోసారి సబ్ డివిజన్ పరిధిలో వన్ టౌన్ పోలీసుల సిబ్బంది.. వేసుకున్న యూనిఫామ్ కు అలాగే ప్రమాణం చేసే సమయంలో చేసిన జ్ఞాపకాలను మరచి పోకుండా… ప్రజలకు పోలీసులు చేస్తున్న నిజాయితీ ని చూపించారు.

వివరాల్లోకి వెళితే విజయనగరం లో అయ్యన్నపేట కు చెందిన సైలాడ ఉమా శంకర్ అనే వ్యక్తి ఆటోను హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు రణస్థలం వెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు ఆటోలో ప్రయాణిస్తూ.. రణస్థలం వద్ద దిగే సమయంలో తమ  రెండు బ్యాగులను ఆటోలో మర్చిపోయారు.

ఇది గమనించని ఆటో డ్రైవరు తమ ఇంటికి వచ్చిన తరువాత ఆటోలో బ్యాగులను గుర్తించి..  వన్ టౌన్ పోలీసులకు బ్యాగులను అప్పగించారు. బ్యాగులను పరిశీలించిన పోలీసులు ఆటోలో ప్రయాణించిన వ్యక్తులను గుర్తించి, వారి సూచనల మేరకు వారి బంధువులకు బ్యాగులను వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు అందజేశారు.

బ్యాగుల్లో 6,100 ల నగదు, మందులు, వ్యాపారానికి సంబంధించిన యంత్రాలు, రక్షలు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి. నిజాయితీతో వ్యవహరించిన ఆటో డ్రైవరు శైలాడ ఉమా శంకర్ ను డా. సీఐ బి.వెంకటరావు అభినందించారు. బ్యాగు యజమానులను గుర్తించడంలో వన్ టౌన్ హెచ్.సీ ఎ.వి.రమణ క్రియాశీలకంగా వ్యవహరించారు.

Related posts

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

Satyam NEWS

ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్

Satyam NEWS

ఫేక్ కాల్: మహిళ కిడ్నాప్ అయింది రండి

Satyam NEWS

Leave a Comment