29.7 C
Hyderabad
May 3, 2024 03: 47 AM
Slider నిజామాబాద్

ఐక్యంగా ఉందాం అభివృద్ధి చెందుదాం

#munnurukapu

వ్యవసాయం పై ఆధారపడిన మున్నూరు కాపులు విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రాణించి మున్నూరు కాపు కులస్తుల ఎదుగుదలకు తోడుగా నిలవాలని అందరూ సమిష్టి కృషితో ముందుకు సాగాలని రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జుక్కల్ నియోజకవర్గ స్థాయి మున్నూరు కాపు సింహ గర్జన కార్యక్రమంలో ఆయన  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ముందుగా బిచ్కుంద మండల కేంద్రంలో భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. బిచ్కుంద బస్టాండ్ ముందర సీనియర్ నాయకులు స్వర్గీయ నాల్చార్ శ్రీహరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజు మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లో అనిచివేతకు గురవుతున్నారని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ప్రత్యేక స్థానం కల్పించి ఆదుకోవాలని అన్నారు.

అతి త్వరలో బాన్స్వాడ డివిజన్ స్థాయిలో మున్నూరు కాపుల సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ  ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకుగా వాడుకొని తర్వాత పట్టించుకోవడం లేదని ప్రతి గ్రామంలో కుల సంఘాల సమావేశమై కార్పొరేషన్ ఏర్పాటుకు తీర్మానాలు చేయాలని మున్నూరు కాపు కులస్తులందరూ ఏకతాటిపై వచ్చి తమ డిమాండ్ల సాధనకై కృషి చేయాలని ముఖ్య అతిథులు సూచించారు.

5000 కోట్లతో ప్రత్యేక మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని, హైదరాబాదులోని కాచిగూడలో ఉన్న మున్నూరు కాపు సభను ఎండోమెంట్ నుండి తీసివేయాలి, ఏరువాక పూర్ణిమ పండగకు మున్నూరు కాపు పండుగా గుర్తించాలి, చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి, వెనుకబడిన మునుర్కాపు కులస్తులకు ప్రభుత్వం ఐదు లక్షలు అందజేసే విధంగా పథకం అమలు చేయాలి అని సభ ప్రాంగణంలో అందరి సమక్షంలో ఐదు తీర్మానాలు చేశారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని మండల, గ్రామస్థాయి అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అపెక్స్ కమిటీ అధ్యక్షులు పుటం పురుషోత్తమరావు పటేల్, మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మామిళ్ళ అంజయ్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, తెలంగాణ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకులలలిత, రేలారే రేలా  సింగర్ గంగా,జుక్కల్ నియోజకవర్గం మండల గ్రామస్థాయి అధ్యక్షులు గడ్డం అరవింద్, అస్పత్ వార్ వినోద్, గుండా మొగులయ్య, సారంగలవార్ గంగారాం, నరహరి, రాజు శ్రీహరి , బోల్లి గంగాధర్, పాకలవిజయ్, బండి విజయ్,బాలాజీ (బాలు శ్రీహరి) బొమ్మల లక్ష్మణ్, హాజీ బాల్రాజ్, పుల్లెన్ విట్టల్, జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గ మున్నూరు కాపులు పాల్గొన్నారు.

జి. లాలయ్య  సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

జస్టిస్ ఫర్ దిశ: ఉపేంద్రా అతితెలివి ప్రదర్శించవద్దు

Satyam NEWS

కడప జడ్పీ లో దేహశుద్ధి జరిగింది మరచిపోయావా నాని

Bhavani

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

Satyam NEWS

Leave a Comment