29.7 C
Hyderabad
April 29, 2024 07: 06 AM
Slider ఖమ్మం

సాదు కుంటారో.. సంపుకుంటారో మీ చేతుల్లోనే ఉంది

#Minister Puvvada Ajay Kumar

అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుండి నేడు ఖమ్మం నగరం అభివృధ్దిలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందని ఇంతటి అభివృద్ది సాధించిన ప్రభుత్వాన్ని, నన్ను సాదుకుంటారో.. సంపుకుంటారో మీ చేతుల్లోనే ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ.2.95 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఖమ్మం నగరం 19వ డివిజన్ నందు SDF నిధులు రు.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 16వ డివిజన్ నందు LRS నిధులు రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. LRS నిధులు రూ.50 లక్షలు సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్ లో LRS నిధులు రూ.85లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు ఖమ్మం నగరం మురికి కూపం లా ఉండేదని, సరైన రోడ్డు వ్యవస్థ, మురుగు వ్యవస్థ, త్రాగునీటి కొరత, అభివృద్ది ప్రణాళిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు గుర్తు చేసుకోవాలన్నారు. ఎమ్మేల్యే గా గెలిచిన నాటి నుండి కేవలం ఖమ్మం అభివృద్దిపై ఒక ప్రణాళికతో, చిత్తశుద్దితో పని చేసి ఒక రుపుకు తీసుకొచ్చామని అన్నారు. మనం చూస్తున్న, అనుభవిస్తున్న అభివృద్ది ఎన్నో రోజుల కఠోర శ్రమ, కోట్ల రూపాయల నిధులు సమీరణ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.

ఖమ్మం నగరం నా ఇల్లు, ప్రజలంతా నా కుటుంబ సభ్యులు కాబట్టే నా ఇంటిని శుభ్రం చేసిన మాదిరిగా చెత్త సేకరణ, మురుగు తొలగింపు, రోడ్లు, డ్రైన్లు, ప్రతి రోజూ ఇంటింటికీ త్రాగునీరు సరఫర ఇలా అనేక పనులు చేపట్టి అభివృద్ది చేసుకున్నామని వివరించారు. అభివృద్ది విషయంలో నిబద్దత తో ఉన్నాం. ఖమ్మం నగరాభివృద్దిలో భాగంగా చెప్పిన అన్ని పనులు చేసినం.. కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి చెప్పనివి కూడా పూర్తి చేసినమని, ఖమ్మం నగరానికి వచ్చినన్ని నిధులు ఏ మున్సిపల్ కార్పొరేషన్ కి రాలేదని, అది కేవలం పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వల్లే సాధ్యమైంది. ఇంకా కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి అభివృద్ది చేసి చూపిస్తాం.

వచ్చే ఎన్నికల్లో మళ్లీ BRS పార్టీ ని గెలిపించాల్సిన బాధ్యత మీదే అన్నారు.ఈ నెల 30వ తేదీన ఖమ్మంకు మంత్రి కేటిఆర్ రానున్నారని, రూ.1200కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఖమ్మం ఎవడో గ్యారెంటి కార్డ్ లు ఇస్తాం అంటారు, దాన్ని నమ్ముకుంటే మనం మళ్ళీ పాత రోజులు చవి చూడాల్సి వస్తుంది, మన గ్యారెంటి కార్డ్ BRS మాత్రమే అన్నారు.

మనకి ఎవరి గ్యారెంటీ అక్కర్లేదు.. మనకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ చాలు అని స్పష్టం చేశారు.రానున్న రోజుల్లో BRS పార్టీ గెలిస్తే ఇంతకు రెండింతలు మరింత అభివృద్ది నగర ప్రజలు చూస్తారని వందల కోట్లు ప్రభుత్వం నుండి తీసుకువచ్చి అభివృద్ది చేసుకుందామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ లు చామకూరి వెంకన్న, మేడారపు వెంకటేశ్వర్లు, కురాకుల వలరాజ్, దండా జ్యోతి రెడ్డి, మున్సిపల్ ఎంఈ కృష్ణలాల్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ రంజిత్, నాయకులు కృష్ణ, పగడాల నాగరాజు, దేవబక్తుని కిషోర్ బాబు, కొల్లు పద్మ, బిచ్చాల తిరుమలరావు, పరమెశ్ తదితరులు ఉన్నారు.

Related posts

పితృదేవతలకు ప్రీతికరమైన మహాలయ అమావాస్య

Satyam NEWS

రాజధాని శిలాఫలకం మీ రాక కోసం ఎదురు చూస్తుంది

Bhavani

అమరావతి రైతులను మళ్లీ అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment