38.2 C
Hyderabad
April 29, 2024 21: 01 PM
Slider నల్గొండ

నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ముస్లిం సోదరులు నిరసన పోరాటం

#hujurnagar

పెంచిన కిరాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మజీద్ దుకాణ సముదాయం ముందు ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు వెంటనే స్పందించాలని వారు వెంటనే డిమాండ్ చేశారు.

శనివారం ముస్లిం సోదరులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌన పోరాటం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మైనార్టీ నేతలు,ఎండి.అజీజ్ పాషా మాట్లాడుతూ గడువు ముగిసిన లీజుదారులు దుకాణాలకు మసీదు కమిటీ పెంచిన అద్దెను ఇవ్వాలని,లేదా బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేశారు.

హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న స్థానిక ఉస్మానియా మసీదు వక్ఫ్  షాపింగ్ కాంప్లెక్స్ కిరాయి గడువు ముగిసినా లీజుదారులు తక్కువ అద్దె చెల్లిస్తూ వారు మాత్రం వేల రూపాయలు ఆర్జించుకుంటూ మసీదు కు వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు.

సంవత్సర కాలంగా మసీదు అభివృద్ధి కుంటుపడిందని,మసీదులో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, నెలకొందని,మసీదు కమిటీకి కేవలం నామమాత్రపు అతి తక్కువ అద్దె చెల్లించటం ఇదెక్కడి న్యాయమని అన్నారు.వక్ఫ్ బోర్డు అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

పట్టణంలో నడిబొడ్డున ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కి మార్కెట్లో వేల రూపాయలు కిరాయి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ లీజు గడువు ముగిసి 10 సంవత్సరాలు దాటినప్పటికీ,గడువు ముగిసినా లీజుదారులు కేవలం 2000 వేల నుండి 3000 వేల రూపాయలు అద్దె చెల్లిస్తూ  సబ్ లిజ్ పేరుతో వేల రూపాయలు ఆర్జిస్తున్నారని,పెంచిన అద్దెలు చెల్లించి ఇవ్వాలని లేదా బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీమ్,ఎస్‌ డి మున్నా,షేక్.బిక్కన్ సాబ్,  పఠాన్ గౌస్ ఖాన్,షేక్.జానీ, నవాబ్, షేక్.మజీద్,సిరాజ్,షేక్.మౌలాలి,ఎస్ కె.గౌస్ షేక్ పాషా,ముస్తఫా,షేక్.బాజీ, రెహమాన్,ఎస్ కె.దస్తగిరి,షేక్.భాషా, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వీరసింహారెడ్డి ఒక విస్ఫోటనం.. చరిత్రలో నిలిచిపోతుంది

Bhavani

ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు సీఎం జ‌గ‌న్ పెద్ద పీట‌…!

Satyam NEWS

జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

Bhavani

Leave a Comment