39.2 C
Hyderabad
April 30, 2024 19: 58 PM
Slider ఆదిలాబాద్

ఏకగ్రీవంగా ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ ఎన్నిక

#adilabaddcc

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ గా అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్  పదవి కోసం జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకు కార్యాలయంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు.  భోజా రెడ్డి ఒకే ఒక్కరు నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  అధికారులు ప్రకటించారు. దింతో చైర్మన్ పదవి మరోసారి ఆదిలాబాద్ జిల్లా కు దక్కినట్లయింది.

కాగా డిసిసిబి చైర్మన్ గా పనిచేసిన కాంబ్లే నాందేవ్ గత ఆరు నెలల క్రితం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.  దీంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది.  దింతో ఖాళీగా ఉన్న చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహించగా  నిర్మల్ జిల్లా కు చెందిన ఇన్చార్జి చైర్మన్ గా ఉన్న రఘునందన్ రెడ్డి,  ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలురి గోవర్ధన్ రెడ్డి, అడ్డి బోజారెడ్డి పదవి కోసం చివరి నిమిషం వరకు పోటీపడ్డారు.

అయితే  టిఆర్ఎస్ అధిష్టానం మాత్రం భోజా రెడ్డి వైపే మొగ్గు చూపడంతో పార్టీ ఆదేశాల మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.  నిబంధనల ప్రకారం ఒక నామినేషన్ దాఖలు కావడంతో భోజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఎన్నికను  స్వాగతిస్తూ టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, ఆదిలాబాద్ జడ్పీ  చైర్మన్ రాథోడ్  జనార్ధన్, డీసీసీబీ వైస్ చైర్మన్  రఘునందన్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ లు , పార్టీ శ్రేణులు భోజా రెడ్డి నీ పూలమాలలు శాలువాలతో సత్కరించి,  అభినందలు తెలిపారు.

ఈ సందర్భంగా అడ్డి భోజా రెడ్డి మాట్లాడుతూ  తనపై నమ్మకంతో పదవినీ అప్పగించిన పార్టీ అధిష్టానానికి, జిల్లా మంత్రి,  ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తూ కేంద్ర బ్యాంక్ అభివృద్ధితో పాటు  రైతులకు అండగా నిలిచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు.

Related posts

విజయనగరం టూటౌన్ పీఎస్ ను పరిశీలించిన ఎస్పీ దీపికా…!

Satyam NEWS

సుబ్బారావు గుప్తాతో రాజీపడిన మంత్రి బాలినేని

Satyam NEWS

పంజాబ్ లో కొత్త మంత్రివర్గం..చన్నీ బృందంలో 15 మంది

Sub Editor

Leave a Comment