39.2 C
Hyderabad
May 3, 2024 13: 35 PM
Slider మహబూబ్ నగర్

చేపట్టే పనుల వివరాలను మన ఊరు మన బడి వెబ్సైట్లో పొందుపర్చాలి

#manuchowdary

మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన 290 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను మన ఊరి మన బడి వెబ్ సైట్లు నమోదు ప్రక్రియను ఇంజనీరింగ్ అధికారులు విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.

గురువారం ప్రజావాణి సమావేశమందిరంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు మన బడి వివరాల నమోదు ప్రక్రియ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 290 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సూచించిన 12 అంశాల్లో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర టాయిలెట్ల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, అదనపు గదుల నిర్మాణం పనుల వివరాలను తప్పనిసరిగా వెబ్ సైట్ నందు పొందుపరచాలని  అదనపు కలెక్టర్ సూచించారు.

వెబ్సైట్లో 12 రకాల పనుల వివరాలను పాఠశాలల వారిగా ఏలా నమోదు చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఈ లకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, ఈఈపిఆర్ దామోదరరావు, ఈ డి ఎం నరేష్, డీఈలు దుర్గాప్రసాద్, నాగలక్ష్మి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

కరోనా హెల్ప్: నిరుపేదలకు గోధుమల పంపిణీ

Satyam NEWS

హరితహారంలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు

Satyam NEWS

తిరుమలలో దారుణం: పారువేట మండపం కూల్చివేత

Bhavani

Leave a Comment