37.2 C
Hyderabad
May 1, 2024 12: 20 PM
Slider ముఖ్యంశాలు

పోలీస్ శాఖ లో ఉద్యోగార్ధులకు నాగర్ కర్నూల్ ఎస్ పి మార్గదర్శనం

#nagarkurnool

పోలీస్ శాఖలో వివిధ స్థాయిలలో చేరాలని ఆసక్తిగా ఉందా? ఏం చేయాలో ఎక్కడ శిక్షణ తీసుకోవాలో తెలియడం లేదా? అలాంటి నిరుద్యోగ అభ్యర్ధులకు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ శిక్షణ అవకాశం కల్పిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి  త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వివిధ స్థాయిలలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రకటించేందుకు అవకాశం ఉన్నందున నాగర్ కర్నూల్ ఎస్ పి ఈ చొరవ తీసుకుంటున్నారు.

పోలీస్ డిపార్ట్మెంట్ లోని సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలలో ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి మనోహర్ సూచన మేరకు కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని కొల్లాపూర్  పోలీస్ స్టేషన్, కోడేరు పోలీస్ స్టేషన్, పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్, పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉచిత  శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించుకోవడానికి ఆసక్తి గల యువతీ యువకులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి కోరారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఇంచార్జి ఎంపీపీగా ఉరుదొండ నరేష్

Satyam NEWS

కేటీఆర్… అసలు నీకు వ్యాక్సిన్ అంటే తెలుసా???

Satyam NEWS

అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Bhavani

Leave a Comment