38.2 C
Hyderabad
May 2, 2024 23: 02 PM
Slider ప్రత్యేకం

కేటీఆర్… అసలు నీకు వ్యాక్సిన్ అంటే తెలుసా???

#vijayashanti

కేటీఆర్.. అసలు నీకు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? వ్యాక్సిన్ అనేది గంటలలోనో… రోజులలోనో… ఉత్పత్తి నడిపి ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు.

అదొక ప్రత్యేకమైన ప్రక్రియ కాదంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు…బీజేపీ మాజీ ఎంపీ, పార్టీ మ‌హిళా మోర్చ  నేత విజ‌య‌శాంతి. ఈ మేర‌కు సుదీర్ఘంగా ప్ర‌ధాని మోడీ స్వ‌దేశీ  ప‌రిజ్ఙానంతో త‌యారు చేసిన వాక్సినేష‌న్ల పంపిణీ పై  మంత్రి కేటీఆర్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా  బీజేపీ మ‌హిళా మోర్చ నేత విజ‌య‌శాంతి మాట్లాడారు.

సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుందని… కానీ ప్ర‌ధాని మోడీ సర్కారు ప్రోత్సాహం, నిర్దిష్టమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంతో..  మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారని…. దాని ఫలితంగానే నేడు ఒకటి కాదు రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇంత జ‌రిగినా  కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేదు.. ప్లాన్ లేదంటూ మాట్లాడుతున్న కేటీఆర్ కు సరైన విజ్ఞత లేదని అర్థమవుతోంది.

ఎందుకంటే ప్రపంచంలో వ్యాక్సినేషన్ మొదలైందే గత డిసెంబర్ లో..! భారత్ లో జనవరి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందని స్ప‌ష్టం చేసారు.. జనవరి 16 నుంచి మొదలు ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా టీకా డోసుల (వ్యాక్సినేషన్) పూర్తి చేశాం. ఇది అమెరికా కంటే ఎక్కువ. ఈ లెక్కలు తెలుసా కేటీఆర్ గారూ? అంటూ విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు.

టీకాల పంపిణీపై టీఆర్ఎస్ సర్కారు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని…. స్వదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయకుండా విదేశాలకు టీకాలు అమ్ముకొంటుందని కేంద్రంపై నిందలు మోపుతున్నవారికి బాధ్యత ఉందా..? స్వదేశీ సాంకేతికతతో టీకా తయారీ చేసుకోవడం మీరు ఓర్చుకోలేకపోతున్నారా..? అంటూ సూటిగా ప్ర‌శ్న‌లు సంధించారు…బీజేపీ మహిళా నేత విజ‌య‌శాంతి.

మీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం మంచిదికాదని…  కరోనా మహమ్మారి భారత్ లో పుట్టలేదు. అది వూహాన్ లో పుట్టి వివిధ దేశాలకు విస్తరించి మన భారత్‌కు అంటుకుందని… అందుకే ప్రపంచానికి వ్యాక్సినేషన్ జరిగినప్పుడే వైరస్ నిర్మూలన అనేది సుసాధ్యం.  అవివేకంతో ఒక్క తెలంగాణలోనే వ్యాక్సిన్ చేస్తా అనుకుంటే అది మీ అజ్ఙాన‌మేన‌ని అన్నారు. 

అస్స‌లు కేసీఆర్ గారి కుటుంబం జీవితమే కమీషన్ల బాపతు  అని… అందుకే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను భారతదేశానికి ఎందుకు తీసుకురావడం లేదని గాయి గాయి పెడ్తున్న మీరు దేశ సంపదను ఆ కంపెనీలకు దోచిపెట్టాలనుకుంటున్నారా..? అంటే దేశంలో ఒక డోసు టీకా 250 ధరకే దొరకొద్దా..? 2వేలు, 3వేలు అంటూ ఇష్టారీతిన రేట్లు పెంచుతూ కమీషన్లు దండుకోవాలనుకోవడం TRS దుర్బుద్ధి కాదా..? అంటూ తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు.

వాక్సినేషన్ ప్రకృ యపై  టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపడం దుర్మార్గమ‌ని…. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉంద‌ని…మొదటి డోసు ఇచ్చిన స్థానాల్లో భారత్ మొదటిస్థానంలో ఉందని…. వచ్చే డిసెంబర్ నాటికి మొత్తం 250 కోట్ల డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యంతో నరేంద్ర మోడీ సర్కారు పనిచేస్తోందని విజ‌య‌శాంతి స్ప‌ష్టం చేసారు..

Related posts

మొక్కలు పెంచడాన్ని పిల్లలకు అలవాటు చేయాలి

Satyam NEWS

టీఆర్ఎస్ లో చేరిన నందిపేట్ జెడ్పీటీసీ యమున

Satyam NEWS

సెకండ్ సెటప్: ఎర్రవెల్లిలో ఎకరం స్థలంలో మరో ఇల్లు

Satyam NEWS

Leave a Comment