38.2 C
Hyderabad
May 1, 2024 20: 46 PM
Slider నల్గొండ

వానాకాలం పంటలకు సాగర్ నీటిని విడుదల చేయాలి

#CPI Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలో కందుల సత్యనారాయణ అధ్యక్షతన సిపిఐ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు మాట్లాడుతూ ప్రస్తుతం నాగార్జున సాగర్  ఐదు వందల ముప్పై మూడు అడుగుల మేర నీటి నిలువ ఉందని, కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల కు పూర్తి స్థాయి నీటి నిల్వకు దగ్గరలో ఉన్నాయని తెలిపారు.

తుంగభద్రకు నీటి ప్రవాహం వస్తున్నందున ప్రస్తుత వానాకాలం పంటకు ముందుగా సాగునీరు ఇవ్వటం వలన వంటలు ఎక్కువ శాతం పండే అవకాశం ఉందని అన్నారు. పైభాగం నుండి వచ్చే వరద నీటిని నిలువ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటి విడుదల తేదీలని ప్రకటించాలని కోరారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొప్పోజు సూర్యనారాయణ, బండారు రాజయ్య, అనంత వీరబాబు, జక్కుల రమేష్, రాము, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గార్లపాటి శ్రీనివాస్

Satyam NEWS

ట్రెడిషన్: ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు

Satyam NEWS

[OTC] Is There A Birth Control Pill That Helps You Lose Weight Supplements For Weight Loss Men Best Weight Loss Pills 2017 Bodybuilding

Bhavani

Leave a Comment