38.2 C
Hyderabad
May 2, 2024 22: 50 PM
Slider నల్గొండ

గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై పి.డి.యాక్ట్

#Nalgonda Police

గత కొన్ని సంవత్సరాలుగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్మగ్లింగ్ తో పాటు భారీగా విక్రయాలు సాగిస్తున్న వ్యక్తిపై పి.డి. యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ మండలం మర్రిగూడకు చెందిన బుర్ర లింగయ్య అలియాస్ సతీష్ గత కొన్ని సంవత్సరాలుగా నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడంతో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆయన వివరించారు.

ఇప్పటి వరకు 11 కేసులలో నిందితుడుగా ఉన్న లింగయ్యపై టూ టౌన్ సిఐ బాషా ఆధ్వర్యంలో పి.డి. యాక్ట్ నమోదు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతి తీసుకుని, నల్లగొండ రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో నిందితునిపై పి.డి.యాక్ట్ కింద కేసు నమోదు చేసి శనివారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించామని డిఎస్పీ తెలిపారు.

సబ్ డివిజన్ పరిధిలో పి.డి.ఎస్. బియ్యం, ఇసుక అక్రమ రవాణా, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై కఠినంగా వ్యవహరించనున్నామని, వీటిపై నిఘాను పెంచామని తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో కొంతమంది వ్యక్తులు అక్రమ రవాణా చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై పి.డి. యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తానని డిఎస్పీ హెచ్చరించారు.

అదే సమయంలో రేషన్ డీలర్లు సైతం పి.డి.ఎస్. బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, దానిపై లోతుగా విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.

Related posts

పేదలకు నిత్యావసరాలు పంచిన మహేంద్ర సంఘం

Satyam NEWS

మంత్రి గంగుల టార్గెట్ గా ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు?

Bhavani

పబ్లిక్ ప్లేస్ లో మందు కొడితే పోలీసు కేసే

Satyam NEWS

Leave a Comment