28.7 C
Hyderabad
May 6, 2024 00: 30 AM
Slider ముఖ్యంశాలు

ఎన్టీఆర్ పేరు తొలగించటంపై నందమూరి రామకృష్ణ నిరసన

#nandamuriramakrishna

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఆ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు నందమూరి తారకరామా రావు అని ఆయన అన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది ఎన్టీఆర్ భావన అని రామకృష్ణ తెలిపారు.

ఈ ఉద్దేశంతోనే 1986 లో నందమూరి తారకరామా రావు మెడికల్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించారని గుర్తు చేశారు. నందమూరి తారకరామా రావు 1996 లో స్వర్గస్థులైయ్యారని ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును నామకరణం చేశారని రామకృష్ణ తెలిపారు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానం గౌరవంతో “డాక్టర్” ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారని రామకృష్ణ గుర్తు చేశారు. అలాంటి చరిత్ర ఉన్న యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని ఆయన అన్నారు.

Related posts

నిరుపేద మహిళకు ఆసరాగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు గడ్డుకాలం దాపురించిందా?

Satyam NEWS

తిరుమలలో భక్తుల రద్దీ

Bhavani

Leave a Comment