38.2 C
Hyderabad
April 29, 2024 19: 55 PM
Slider విజయనగరం

విజయనగరంలో డ్రగ్స్ కలకలం: ఇద్దరి అరెస్టు

#vijayanagarampolice

సుమారు రూ. 5 లక్షల విలువైన 65 స్క్వేర్ పీసెస్ ఎస్.ఎస్.డి. డ్రగ్ స్వాధీనం

విజయనగరం 1వ పట్టణ పిఎస్ పరిధిలో ఎల్.ఎస్.డి. డ్రగ్స్ కలిగిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి సుమారు 5 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ జిల్లాలో ప్రప్రధమంగా లైసర్జిక్ ఏసిడ్ డయాత్లమైడ్ అనే డ్రగ్ ను పట్టుకోవడం జరిగిందన్నారు. విజయనగరం పట్టణంకు ఉల్లివీధికి చెందిన (1) ఎ-1, కొండపు సందీప్ రెడ్డి (27 సం.లు) కుమ్మరి వీధికి చెందిన (2) ఎ-2, శఠగోపం గణేష్ (26 సం.లు) చెందిన ఇద్దరు వ్యక్తులు సుమారు 16 మాసాలు క్రితం జరిగిన వివాహ వేడుకల్లో విశాఖపట్నం ఐ.టి. ప్రాంతానికి చెంది, ప్రస్తుతం బెంగుళూరు లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి (ఎ-3)తో పరిచయం ఏర్పడింది.

ఎ-3 చాలా విలాసవంతంగా జీవిస్తున్నట్లుగా, నిందితులు కొండపు సందీప్ రెడ్డి (ఎ-1) మరియు శఠగోపం గణేష్ (ఎ-2) గుర్తించి, అతనితో పరిచయం పెంచు కున్నారు. ఎ-3 తాను చెప్పిన వ్యాపారం చేసినట్లయితే సులువు గా డబ్బులు సంపాదించవచ్చునని ఎ-1 మరియు ఎ-2 లకు ఆశలు కల్పించాడు.

అతని మాటలు నమ్మిన నిందితులు సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఎల్.ఎస్.డి. డ్రగ్స్ వ్యాపారం చేసేందుకు ఆసక్తి కనబర్చారు. ఇందులో భాగంగా ఎ-3 ఫోను నంబరు 9019104634 కు రూ.7 వేలు నగదును ఫోను పే చేయగా, ఎ-3 కొరియర్ ద్వారా ఎల్.ఎస్.డి. డ్రగ్స్ ను, ఒక వాచీని ఒక మొబైల్ బాక్సులో పెట్టి, డిటిడిసి కొరియర్ ద్వారా విజయనగరంలో ఉంటున్న ఎ-1 కొండపు సందీప్ రెడ్డి, ఎ-2 శఠగోపం గణేష్ కు పంపినాడు.

ఈ డ్రగ్స్న కొరియర్ నుండి తీసుకొని వెళ్ళిపోతుండగా, పోలీసులకు లభించిన సమాచారంతో వారిని పట్టుకొని, వారి నుండి 65 స్క్వేర్ పీసెస్ ఎల్.ఎస్.డి. డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులు సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో డ్రగ్స్ వ్యాపారం అనే ఉచ్చులోకి వచ్చారన్నారు.

నిందితులు అధిక లాభాలను ఆర్జించేందుకు అక్రమ వ్యాపారాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ కేసులో నిందితులను మరింత లోతుగా విచారించి, అసలు సూత్రదారులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. నిందితులు ఒక్కొక్క ఎల్.ఎస్.డి. స్క్వేర్ పీస్ను 7 వేలుకు విక్రయించనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్, 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు, 2వ పట్టణ సిఐ సిహెచ్. లక్ష్మణరావు, ఎస్బీ సిఐ సిహెచ్. రుద్రశేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

వర్క్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ ని బదిలీ చేయండి

Satyam NEWS

Analysis: వలసపోతున్న దేశ అభివృద్ధి

Satyam NEWS

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

Satyam NEWS

Leave a Comment