36.2 C
Hyderabad
May 7, 2024 13: 37 PM
Slider ఆంధ్రప్రదేశ్

నారా లోకేష్ ను అరెస్టు చేసిన పోలీసులు

lokesh 07

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాస్తారోకో వైపు వెళ్తున్నాడని.. అందుకే ఆయన్ను అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని లోకేష్‌ అంటున్నారు. లోకేష్‌తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related posts

విధులకు గైర్హాజరు… అయితే రిజిస్టర్లో మాత్రం సంతకాలు

Satyam NEWS

గంజాయి సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదు

Satyam NEWS

సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ లో చేరిన నాయీబ్రాహ్మణలు

Satyam NEWS

Leave a Comment