ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడైన వారి ఇంటిని గ్రామస్తులు తగలపెట్టేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మడలం గొలనుకొండలో సోమవారం రాత్రి కన్ రెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో దానబోయిన పరుశరాములు అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం టూవీలర్ పై వెంకట్ రెడ్డి తన భార్యతో కలిసి జనగామ కు వెళ్లి వస్తుండగా సిరిపురం-గొలనుకొండ రహదారిలో హత్యకు గురయ్యాడు.
మాటు వేసిన పరుశురాములు మరి కొందరు కత్తులతో పొడవడంతో వెంకట్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా అతని భార్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది. వీరికి ఇద్దరు ఆడ బిడ్డలు. వెంకటరెడ్డి హత్యతో కోపానికి గురైన గ్రామస్థులు ఈరోజు పరుశురాములు ఇంటిని కాలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గొలనుకొండ చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. గ్రామంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు.