37.2 C
Hyderabad
April 30, 2024 12: 32 PM
Slider అనంతపురం

స్పెషల్ బ్రాంచ్ అంటే జిల్లా పోలీస్ శాఖకు కళ్ళు చెవులు లాంటిది

#ananthapurpolice

సాధారణ వార్షిక తనిఖీల నిమిత్తం శనివారం అనంతపురం రేంజ్ డిఐజీ ఎం. రవి ప్రకాష్ తిరుపతి జిల్లా ఎస్పి పి.పరమేశ్వర తో కలసి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బాగంగా  జిల్లా పోలీస్ కార్యాలయంలో  వివిధ విభాగాలకు చెందిన రికార్డులను అధికారుల   ద్వారా సమాచారాన్ని తెలుసుకొని సిబ్బంది సర్వీస్ పరమైన విషయాలు, సంక్షేమ విషయాలలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని పలు సూచనలు చేశారు.

అనంతరం జిల్లా స్పెషల్ బ్రాంచ్(SB) మరియు డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(DCRB) లను కూడా తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీస్ శాఖకు అతి ముఖ్యమైన సమాచార వ్యవస్థ, జిల్లాలో జరిగే అనుకొని బంద్ లు ధర్నాలు, రాస్తారోకోలు, పాస్పోర్ట్  వెరిఫికేషన్, అసాంఘిక కార్యకలాపాలు మరియు రాజకీయపరమైన అంశాలపై ముందస్తు సమాచారం సేకరించి శాంతి భద్రతల పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించాలన్నారు.

స్పెషల్ బ్రాంచ్ అంటే జిల్లా పోలీస్ శాఖకు కళ్ళు చెవులు లాంటివారు మీరు ఇచ్చే సమాచారం మేరకే ఎస్పీ నిర్ణయం తీసుకుంటారు. పార్టీలతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టు, జరిగినది జరిగినట్టు చెప్పాలి అప్పుడే న్యాయం చేసిన వారమవుతాం. జిల్లా వ్యాప్తంగా ముందస్తు సమాచారాన్ని  సేకరించి పై అధికారులకు తెలపాలి ఎన్నికలు రాబోతున్న సందర్భంలో బాగా కష్టపడి పనిచేసి జిల్లా ఎస్పి కి మంచి పేరు తీసుకురావాలన్నారు.

డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(DCRB)ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి, డి.సి.ఆర్.బి. నందు జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే కేసుల వివరాల గురించి సిఐ ని అడిగి తెలుసుకున్నారు, రౌడీలు, కేడీలు, అనుమానితుల రిజిస్టర్లు  పలు రికార్డులు మొదలగునవి అలాగే జిల్లా మొత్తం కేసుల పరమై  ఏ సమాచారం గురించి కావాలన్నా డి.సి.ఆర్.బి. నే ముఖ్యపాత్ర  పోషిస్తుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది ఎప్పటికప్పుడు నవీకరణ చేస్తూ పెండింగ్ లేకుండా సరిచూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరావు పరిపాలన, ఏవో కిషోర్ కుమార్ ఎస్బి డిఎస్పి సురేందర్ రెడ్డి, సీఐలు రామకృష్ణ చారి, శ్రీనివాసులు, డి.సి.ఆర్.బి. సిఐ చంద్రశేఖర్ పిళ్ళై  ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మట్టి మిద్దె కూలిపోయి ముగ్గురు మృతి

Satyam NEWS

గ‌జ వాహ‌నంపై లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అభయం

Satyam NEWS

వైకుంఠ ఏకాద‌శికి తిరుమలలో స‌ర్వం సిద్ధం

Satyam NEWS

Leave a Comment