29.7 C
Hyderabad
May 2, 2024 05: 42 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు జాతీయస్థాయి ప్రశంసలు

#vikram

కాకుటూరు, విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ తరపున తొమ్మిది మంది విద్యార్థులు 12 జనవరి నుంచి16 జనవరి 2023 వరకు అగ్రికల్చర్ యూనివర్శిటీ కర్ణాటక హుబ్బాలి, ధర్వాద్ లో నేషనల్ యూత్ ఫెస్టివల్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ కి ముఖ్యఅతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి, కేంద్ర కిడాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

అంతేకాక ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్  కు 28 రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ల పాల్గోన్నారు. యూత్ ఫెస్టివల్ క్యాంప్ లో సాంస్కృతిక, సాంఘిక, యోగా కార్యక్రమాల్లో  చురుగ్గా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల  యం. పూర్థిరాజ్,యం. సూర్యతేజ,  జి. నవ్యశ్రీ, కె.సందీప్ కుమార్, ప్రియ,శ్రీనివాసులు,జాహ్ణవి,వైష్ణవి, జ్ఞాపిక పాల్గొన్నారు. విక్రమ సింహపురి యూనివర్శిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గా యం. పూర్థిరాజ్,యం. సూర్యతేజ,  జి. నవ్యశ్రీ, కె.సందీప్ కుమార్, ప్రియ, శ్రీనివాసులు లను ఉపకులపతి జి. యం సుందరవల్లి అభినందించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ఇలాంటి మరెన్నో విజయాలను సాధించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య. పి. రామచంద్రారెడ్డి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి. విజయ ఆనంద బాబు ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం,  ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే సునీత డాక్టర్ కే. విద్యా ప్రభాకర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Related posts

ఏసీబీ కోర్టులో ఈఎస్‌ఐ స్కాం నిందితుడు స‌రేండ‌ర్

Sub Editor

Скальпинг на форекс: Лучшая скальпинг стратегия для торговли на Форекс

Bhavani

ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు జగన్ రెడ్డీ?

Satyam NEWS

Leave a Comment