40.2 C
Hyderabad
May 1, 2024 18: 50 PM
Slider ముఖ్యంశాలు

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

#BichkundaSportsperson

జాతీయస్థాయిలో జమ్మూ రాష్ట్రంలోని ఎం ఏ స్టేడియంలో ఈనెల 19 నుండి 21 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు గుండ అనిల్ అండర్ 17 పోటీలో బంగారు పతకాలు సాధించారు.

ఈ సందర్భంగా ఆదివారం వాజిద్ నగర్ గ్రామంలో సర్పంచ్ తోట అనూయ లక్ష్మీనారాయణ గ్రామ పెద్దలతో కలిసి  బంగారు పతకం గెలుపొందిన గుండా అనిల్ అతని తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించి గ్రామంతో పాటు మండలం, రాష్ట్రస్థాయి లో గుర్తింపు తెచ్చుకోవాలని గ్రామము తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, చదువులలో క్రీడలలో రాణించే విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా సర్పంచ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకట్రావు, గోపాల్ రెడ్డి, ఎం పి టి సి బండి కింద సాయిలు, ఉప సర్పంచ్ బద్రి సాయిలు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచ్లు, గ్రామ యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ ను కలిసిన డి ఎస్ సేవ సభ్యులు

Satyam NEWS

[OTC] Best Weight Loss Pills 2013 For Women Which Is The Best Birth Control Pill For Weight Loss Weight Loss Pills That Start With V

Bhavani

పోలీసులకు చిక్కిన కొండగట్టు ఆలయం దొంగలు

Satyam NEWS

Leave a Comment