33.7 C
Hyderabad
April 28, 2024 23: 30 PM
Slider ముఖ్యంశాలు

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభకు జాతీయ గుర్తింపు

#SriChitanya

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు విద్య నభ్యసిస్తున్న 6వ, తరగతికి చెందిన జిల్లేపల్లి యశ్వంత్, మూర తరుణ్ తేజ, సల్వాది సాయి మణికంఠ, నవధీర్ విష్ణు, జోగు దివిస్ రెడ్డి,

8వ,తరగతికి చెందిన నూకల తేజశ్రీ, గాయం జశ్వంత్ రెడ్డి, మాలోతు సాయి శ్రీకాంత్, మీసాల సుజన కీర్తీ,ఎలక శందుకర్ రెడ్డి,తలపురెడ్డి శరణ్య, 9వ, తరగతికి చెందిన అరిగల సాయికుమార్, పాల్వాయి తేజ, ఓరుగంటి భవాని నాసా 2020కి నిర్వహించిన పోటీలో పంపిన మార్వేల్ (స్వేస్ హోటల్) ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం లభించిందని పాఠశాల చైర్మన్ శ్రీధర్, ప్రిన్సిపాల్ ఎన్. ఉపేందర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 250 ప్రాజెక్టులు పోటీలో ఉండగా తమ పాఠశాలకు ద్వితీయ స్థానం లభించడం ఆనంద దాయకం గా ఉంది అని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే సాంకేతిక విద్యపై మక్కువ చూపించి భవిష్యత్తులో ఉన్నతమైన శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆశీర్వదించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీవిద్య,DGM సుధాకర్,డీన్ గోపి, శ్రీనివాసరెడ్డి, కృష్ణకుమారి, సంధ్య,AO మద్దూరి వెంకట్ రెడ్డి, నాగసైదులు, మదర్ సాహెబ్,చిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి

Bhavani

మూల వంక పాత నేషనల్ హైవే ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

Bhavani

వాసిరెడ్డి జయశ్రీ ప్రథమ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు అన్నదానం

Satyam NEWS

Leave a Comment